JEN co
-
రాష్ట్రానికి ‘మందాకిని’!
సాక్షి, అమరావతి :మరో బొగ్గు క్షేత్రాన్ని కైవసం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) అడుగులేస్తోంది. దీనివల్ల జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత తీరుతుంది. కొత్తగా ఉత్పత్తిలోకి వచ్చే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలకూ మరింత ప్రయోజనం కలుగుతుంది. ఒడిశాలోని అంగుల్ జిల్లా బైండా, లుహ్మరా గ్రామాల్లో తాల్చేరు కోల్‌ఫీల్డ్స్ (మందాకిని) కు కేంద్ర బొగ్గు గనుల శాఖ అన్ని అనుమతులు తీసుకుంది. సొంత అవసరాల కోసమే ఈ క్షేత్రాన్ని కేటాయించాలని నిర్ణయించింది. ఏపీ జెన్కో ఈ బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఈ క్షేత్రంలో నాణ్యమైన బొగ్గు లభిస్తుందని సర్వేలో తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక్కడ మొత్తం 653.66 హెక్టార్లలో బొగ్గు తవ్వకానికి వీలుందని తేలింది. ఇందులో 324.52 హెక్టార్ల అటవీ ప్రాంతానికి ఆ శాఖ 2013లోనే అవసరమైన అనుమతులిచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా 2011లో లభించాయి. ఈ బొగ్గు క్షేత్రం నుంచి మొత్తం 287.886 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభిస్తుందని వెల్లడైంది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్ ప్లాంట్లకు ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభ్యమవుతుంది. ఈ నేపథ్యంలో.. మందాకిని బొగ్గు క్షేత్రం కోసం సేకరించే 274.52 హెక్టార్ల ప్రైవేటు భూమి విషయంలో పునరావాస కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సమీపంలోనే మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్) ఉంది. దీని నుంచి రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు ఏటా 13 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు కేటాయింపులున్నాయి. ఎంసీఎల్‌కు సమీపంలోనే ఏపీకి చెందిన వాష్డ్ కోల్ (బొగ్గు శుద్ధి) కేంద్రాలున్నాయి. అక్కడి నుంచి బొగ్గు రవాణాకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పైగా ఈ బొగ్గు.. నాణ్యతతో పాటు, తక్కువ ధరకూ లభిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీకే ఈ బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది దక్కితే జెన్కో ప్లాంట్లకు బొగ్గు కొరత చాలా వరకు తీరుతుందని భావిస్తున్నారు. బొగ్గు కొరత తీరుతుంది మందాకిని కోల్ బ్లాక్‌ను దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇది మనకు వస్తుందనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇది అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా థర్మల్ ప్లాంట్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే బొగ్గు కొరతను నివారించినట్లు ఉంటుంది. ఏపీ జెన్కో నుంచి అధికారులు కూడా ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతమంతా బొగ్గు నిక్షేపాల మయం కాబట్టి పునరావాసానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం. – శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ -
తెలంగాణ జెన్కోకు ఇద్దరు డెరైక్టర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ జెన్కోకు ప్రభుత్వం ఇద్దరు డెరైక్టర్లను నియమించింది. ఈ మేర కు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోిషీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జెన్కోలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న సచ్చిదానందంను డెరైక్టర్ (థర్మల్)గా, జూలై 31న పదవీ విరమణ చేసిన వెంకటరాజంను డెరైక్టర్ (హైడల్)గా నియమించారు. వీరి నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొన్నారు. టీ జెన్కోకు డెరైక్టర్లను నియమించాలని సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు జూన్ 13న ప్రభుత్వాన్ని కోరారు. -
కాక షురూ!
సాక్షి, హైదరాబాద్: జనవరి కూడా ముగియలేదు. కరెంటు కోతల ‘కాక’ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యు త్ పంపిణీ సంస్థలు అనధికార కోతలు అమలు చేస్తున్నారుు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలాంటి నగరాల్లో,జిల్లా కేంద్రాల్లో రెండు గంటలు, పురపాలక సంఘాలు-పట్టణాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలు, గ్రామాల్లో పన్నెండు గంటలు కోతలు విధిస్తున్నారు. హైదరాబాద్‌లో అధికారికంగా కోతలను ప్రకటించనప్పటికీ గురువారం చాలా ప్రాంతాల్లో గంట నుంచి రెండున్నర గం టలు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మెయింటెనెన్స్ పనుల వల్ల కోత విధించామని సిబ్బంది చెప్పినా.. చాలాప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవటం విద్యుత్తు కోతలు మొదలయ్యాయనే విషయాన్ని స్పష్టం చేసింది. నీటిని ఇష్టానుసారం వాడితే ఎలా? జలాశయాల్లోని నీటిని ప్రణాళికబద్ధంగా వాడాల్సిందిపోయి ఇష్టానుసారంగా వాడి విద్యుదుత్పత్తిని చేయటం ఏంటని జెన్కో, డిస్కంలను ఇంధన శాఖ ప్రశ్నించింది. ప్రణాళికలు లేకుండా నీటిని వాడితే రబీలో కష్టాలు తప్పవని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన జెన్కో, డిస్కంలకు గురువారం లేఖ రాశారు. విద్యుత్ డిమాండ్- సరఫరా సమానంగా ఉన్న సమయంలోనూ శ్రీశైలం, నాగార్జునసాగర్, సీలేరు ప్లాం ట్లలో కరెంటును ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. విలువైన నీటిని వృథా చేస్తే ఎండాకాలంలో యూనిట్‌కు రూ.15 పెట్టి నాఫ్తాతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.