సాక్షి, హైదరాబాద్: జనవరి కూడా ముగియలేదు. కరెంటు కోతల ‘కాక’ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యు త్ పంపిణీ సంస్థలు అనధికార కోతలు అమలు చేస్తున్నారుు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలాంటి నగరాల్లో,జిల్లా కేంద్రాల్లో రెండు గంటలు, పురపాలక సంఘాలు-పట్టణాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలు, గ్రామాల్లో పన్నెండు గంటలు కోతలు విధిస్తున్నారు. హైదరాబాద్‌లో అధికారికంగా కోతలను ప్రకటించనప్పటికీ గురువారం చాలా ప్రాంతాల్లో గంట నుంచి రెండున్నర గం టలు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మెయింటెనెన్స్ పనుల వల్ల కోత విధించామని సిబ్బంది చెప్పినా.. చాలాప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవటం విద్యుత్తు కోతలు మొదలయ్యాయనే విషయాన్ని స్పష్టం చేసింది.
నీటిని ఇష్టానుసారం వాడితే ఎలా?
జలాశయాల్లోని నీటిని ప్రణాళికబద్ధంగా వాడాల్సిందిపోయి ఇష్టానుసారంగా వాడి విద్యుదుత్పత్తిని చేయటం ఏంటని జెన్‌కో, డిస్కంలను ఇంధన శాఖ ప్రశ్నించింది. ప్రణాళికలు లేకుండా నీటిని వాడితే రబీలో కష్టాలు తప్పవని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన జెన్‌కో, డిస్కంలకు గురువారం లేఖ రాశారు. విద్యుత్ డిమాండ్- సరఫరా సమానంగా ఉన్న సమయంలోనూ శ్రీశైలం, నాగార్జునసాగర్, సీలేరు ప్లాం ట్లలో కరెంటును ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. విలువైన నీటిని వృథా చేస్తే ఎండాకాలంలో యూనిట్‌కు రూ.15 పెట్టి నాఫ్తాతో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
కాక షురూ!
Published Fri, Jan 24 2014 12:32 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement