అంధకారంలో బంజారాహిల్స్
హైదరాబాద్ : శుక్రవారం హైదరాబాద్ లో గాలివాన సృష్టించిన బీభత్సం నుంచి జనం ఇంకా తేరుకోలేదు. ఎక్కడి చెట్లు అక్కడే పడి ఉండగా కరెంటు వైర్లు తెగిపోయి పునరుద్దరించడంలో జాప్యం జరగడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు అత్యధిక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. విరిగిపడ్డ చెట్లను, కొమ్మలను తొలగించడంలో జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ స్క్వాడ్ అంతగా ప్రభావం చూపలేదు. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన ప్రాంతాల్లో ఇంకా భీభత్స వాతావరణం నెలకొంది. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యమంత్రి నివాసిత ప్రాంతం బంజారాహిల్స్ లోని నందినగర్‌లో శనివారం సాయంత్రం వరకు కరెంటు పునరుద్దరించకపోవడంతో స్థానికులంతా అంధకారంలో గడపాల్సి వచ్చింది.