‘కంతనపల్లి ’ పనుల పర్యవేక్షణకు డివిజన్ల ఏర్పాటు
వరంగల్ రూరల్ : పీవీ.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు ఒక డివిజన్‌తోపాటు 4 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏటూరునాగారంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు చింతగట్టులోని గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్)లో ఇప్పటివరకు పనిచేస్తున్న ఒక డివిజన్, నాలుగు సబ్ డివిజన్ల కార్యాలయాలను కంతనపల్లి నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేయాలని జీఎల్ఐఎస్ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు చింతగట్టు నుంచి ఏటూరునాగారం మండలానికి షిఫ్ట్ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే.జోషి ఉత్తర్వులు జారీ చేశారు.