
అమరావతి: విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వేస్తామని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని చెప్పినా, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నా కల్పిత వార్తలు రాస్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచురించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.