సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని 135 విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందన్నారు. ఏపీ జెన్‌కోకు రావాల్సిన బొగ్గు ఇంకా రాలేదని తెలిపారు. 190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ అవసరం అవుతోందన్నారు.(చదవండి: సంక్షేమాన్ని అడ్డుకోవడానికే టీడీపీ కేసులు: మంత్రి బొత్స)
కోల్ ప్లాంట్లకు బకాయిలు లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. సోలార్ విండ్ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్లకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా బొగ్గు రేట్లు పెరిగాయన్నారు. డిమాండ్ ఎక్కవ కావడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని శ్రీకాంత్ అన్నారు.
చదవండి:
తనయుడి కోసం డిక్షనరీ రాసిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment