
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల మెరుపు సమ్మె
అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి!
జిల్లాలో 850 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు
విజయవాడ : విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మెకు దిగా రు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి వెళ్లి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మధ్నాహ్నం విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ నేతలు జిల్లా ఎస్‌ఈ మోహనక ృష్ణకు సమ్మె నోటీసు అందజేశారు. జిల్లాలోని 209 సబ్‌స్టేషన్లలో 850 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 30 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం 180 సబ్‌స్టేషన్లలో మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్‌మెన్ ఉన్నారు.
గతంలోనే విద్యుత్ కాంటాక్ట్ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించిన క్రమంలో సదరన్ కంపెనీ ఈ నెల 23న వారిని చర్చలకు ఆహ్వానించింది. అయితే వారు సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెలోకి వెళ్లి విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దీంతో జిల్లాలో సబ్‌స్టేషన్ల పరిధిలో జరిగే తక్షణ మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో గత 18 ఏళ్లుగా 15 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ...
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి.
గ్లోబల్ టెండర్ల విధానాన్ని రద్దు చేయాలి.
థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టర్లు చెల్లించే సూపర్‌వైజ్ చార్జీలను కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టాలి.