ప్రతి నెలా విద్యుత్ బిల్లులు వసూలు చేయడంలో అధికారులు చూపించే ఉత్సాహం.. వినియోగదారులకు సేవలందించడంలో మాత్రం కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
* విద్యుత్ శాఖలో ఏళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు
* వినియోగదారులకు తగినంతగా పెరగని ఉద్యోగులు
* చిన్న సమస్య వచ్చినా గ్రామాల్లో అంధకారమే
* పనిభారంతో ఉన్న సిబ్బంది సతమతం
ఖమ్మం: ప్రతి నెలా విద్యుత్ బిల్లులు వసూలు చేయడంలో అధికారులు చూపించే ఉత్సాహం.. వినియోగదారులకు సేవలందించడంలో మాత్రం కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకు విద్యుత్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నా.. కోట్ల రూపాయల బిల్లులు వసూలవుతున్నా.. అందుకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బందిని నియమించడంలో ఎన్‌పీడీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉన్నవారిపైనే అధిక బారం పడటం, ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా సేవలు అందించే ఉద్యోగులు లేరు. చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సి వచ్చినా.. సకాలంలో ఎల్‌సీ తీసుకునే వారు లేకపోవడం, ప్రైవేట్ వ్యక్తులతో రిపేర్ చేయించకపోవడంతో ప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడిన ఘటనలు కూడా ఉన్నాయి. జిల్లాలో ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ వంటి ఉన్నత స్థాయి పోస్టుల్లో ఒక్క ఏడీ పోస్టు మాత్రమే ఖాళీగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలు 16, బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ముంపు ప్రాంత ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో ఖమ్మంలో సోమవారం ఆందోళన చేపట్టారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా బయల్దేరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకుని అక్కడ బైఠాయించారు.
ఆప్షన్ల ప్రకారం తమను తెలంగాణకే బదిలీ చేయాలని, ఆంధ్ర వేతనాలు తమకు వద్దని నినదించారు. ‘మా జీవితాలు తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడికే బదిలీ చేయాలి. మా సేవలు, మా జీవితాలు తెలంగాణకే అంకి తం’ అంటూ హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ, ముంపు ప్రాంత ఉద్యోగుల ఫోరం నాయకులు మాట్లాడుతూ ముంపు మండలాల ఉద్యోగులను ఆప్షన్ల ప్రకారం బదిలీ చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. ఏపీలో ‘ముంపు’ ఉద్యోగులను అక్కడి అధికారులు వేధిస్తున్నారన్నారు. ఉద్యోగుల ప్రమేయం లేకుండా ఎల్‌పీసీలు తీసుకెళ్లారని విమర్శించారు. సర్వీసు బుక్స్ తీసుకెళ్తున్నారని, చీటికి మాటికి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మం డిప్యూటీ ఈఓ బస్వారావుకు వినతిపత్రం అందచేశారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా
డిప్యూటీ ఈఓకు వినతిపత్రం ఇచ్చిన అనంతరం డీఈఓ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. అక్కడే ఉన్న రాష్ర్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆశ్వారావుపేట ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, కల్టెక్టర్ ఇలంబరితి వద్దకు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ ముంపు ఉద్యో గుల సమస్య పరిష్కారం కోసం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ఆర్‌తో చర్చించామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఫైల్‌ను పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చా రు. దీంతో ఉద్యోగులు ఆందోళన విరమించా రు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నాయకులు వల్లోజు శ్రీనివాస్, గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు లక్ష్మణ్, రామారావు, ముంపు మండలాల ఉపాధ్యాయుల ఫోరం నాయకులు రాజు, హతీరాం, శ్రీనివాస్, టీపీటీఎఫ్ నాయకుడు నాగిరెడ్డి, టీయూటీఎఫ్ నాయకుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి వినతి
ఖమ్మం జెడ్పీసెంటర్ : ముంపు మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలెక్టర్ చాంబర్‌లో కలిశారు. ముంపు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఇప్పటికే ఉద్యోగుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యను పరిశీలిస్తోందన్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులను హైదరాబాద్‌కు రావాలని సూచించారు.