జీపు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆమె ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.
- మక్కపేట వద్ద కారును ఢీకొట్టడంతో ప్రమాదం
- చిన్నారి మృతి, నలుగురికి గాయాలు
- బాధితులు ఖమ్మం జిల్లా వాసులు
మక్కపేట(వత్సవాయి) : జీపు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ బాలిక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆమె ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మక్కపేట-చిల్లకల్లు గ్రామాల మధ్య ఎన్‌ఎస్‌పీ మేజర్ కాలువ వద్ద శనివారం తెల్లవారుజామున కారును వేగంగా వస్తున్న జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక మృతిచెందగా, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నా యి.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడు గ్రామానికి చెందిన సగ్గుర్తి రామారావు అదే జిల్లాలోని అశ్వారావుపేటలో విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తున్నా రు. వ్యక్తిగత పనుల మీద కుటుంబసభ్యులతో కలిసి కారులో శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రయాణమయ్యారు.
మార్గమధ్యంలో పెనుగంచిప్రోలులోని బంధువుల ఇంటివద్ద ఆగారు. ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకుని శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరారు. మక్కపేట దాటిన తరువాత ఎన్‌ఎస్‌పీ మేజర్ కాలువ వద్ద వేగం గా వస్తున్న జీపు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రామారావు కు మార్తె అక్షయ(12) అక్కడికక్కడే మృతి చెం దింది. రామారావుతో పాటు ఆయన భార్య శైలజ, కుమారుడు యశ్వంత్‌బాబు, కారు డ్రైవర్ నాగుల్‌మీరా తీవ్రంగా గాయపడ్డారు.
108లో వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన జీపు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పెనుగంచిప్రోలు ఎస్సై నాగప్రసాద్ సిబ్బం దితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు.