సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.17,102 కోట్ల విద్యుత్ సబ్సిడీల తోపాటు మరో రూ.40,981 కోట్ల ప్రభుత్వ విద్యుత్ బిల్లుల బకాయిలు (హెచ్‌టీసీసీ) కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను 2024–25 బడ్జెట్‌లో కేటా యించాలని ఇంధనశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023– 24లో డిస్కంలకు రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సి డీని మంజూరు చేయగా దాన్ని రూ.17,120 కోట్లకు పెంచాలని ఇంధన శాఖ కోరింది. అందులో టీఎస్ ఎస్పీడీసీఎల్‌కు రూ.3,654.51 కోట్లు, టీఎస్‌ఎన్పీ డీసీఎల్‌కు రూ.14,048 కోట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ఇప్ప టికే అందిస్తున్న రాయితీలను కొనసాగించడంతో పాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను 2024–25లో ప్రారంభించడానికి రూ. 17,120 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది.
ప్రతి పాదిత సబ్సిడీలో రూ. 4 వేల కోట్లు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించినవేనని అధికార వర్గాలు తెలిపాయి. రూ. 17,120 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా వచ్చే ఏడాది కొంత మొత్తంలో విద్యుత్ చార్జీలను పెంచకుంటే డిస్కంల నష్టాలు మరింతగా పెరిగి పోతాయని అధికారులు తెలిపారు.
సర్కారీ బకాయిలు రూ.40 వేల కోట్లు ఇవ్వండి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి వివిధ శాఖలు, విభాగాల నుంచి డిస్కంలకు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.28,842.72 కోట్లకు పెరిగాయని పేర్కొంటూ ఇటీవల విద్యుత్‌పై ప్రవేశ పెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఇతర విద్యుత్ బిల్లుల బకాయిలు కలిపి మొత్తం రూ.40,981 కోట్లను డిస్కంలకు 2024–25లో చెల్లించాలని ఇంధన శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రూ.17,120 కోట్ల సబ్సిడీ, రూ.40,981 కోట్ల పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.58,684.17 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని కోరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment