కోవిడ్ కాలంలోనూ చిన్న పరిశ్రమలను ఆదుకున్న జగన్ ప్రభుత్వం
బాబు బకాయిలు రూ.1,588 కోట్లను తీర్చింది ఈ సర్కారే..
మరో రూ.2,087 కోట్ల పారిశ్రామిక రాయితీలూ విడుదల
బాబు పాలనకు మించి ఆరింతలుగా పెరిగిన ఎంఎస్‌ఎంఈలు
పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా బాబుకు రామోజీ బాకా
అక్షరమనే వజ్రాయుధాన్ని ఎంతగా భ్రషు్టపట్టించాలో అంతగానూ రామోజీ భ్రషు్టపట్టిస్తున్నారు..ఈనాడు అంటేనే ఏవగింపు కలిగేలా అబద్ధాలు, కుళ్లూ కుట్రల రాతలతో పత్రికను నింపేస్తున్నాడీ ఎల్లో పెద్ద మనిషి. చంద్రబాబంటే ఆమడదూరం పారిపోయే పారిశ్రామికవేత్తలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాతే తెప్పరిల్లారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ జగన్ పరిశ్రమలను ఆదుకున్నారని దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న సీఎంగా గుర్తింపు పొందారు. అయిదేళ్ల కిందట తమకు దక్కని రాయితీలను పారిశ్రామిక వేత్తలు జగన్ ప్రభుత్వంలోనే అందుకుంటున్నారు.
ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగానే పారిశ్రామిక వికాసం, ఉద్యోగ కల్పన పెరిగాయనడానికి తలసరి ఆదాయ వృద్ధే నిదర్శనం...ఈ నిజం రామోజీకి తెలిసినా, తప్పుడు రాతలకే కంకణం కట్టుకున్నారు కనుక కట్టుకథలనే అల్లుతారు.. జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఎగుమతులు పెరిగాయి...చంద్రబాబు హయాంలో ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్యతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆరింతలుగా పెరిగింది...వాస్తవాలెప్పుడూ రామోజీకి చేదుగానే ఉంటాయి...అందుకే అక్షర గరళాన్ని జగన్ ప్రభుత్వంపై చిమ్ముతూనే ఉంటాడీయన...
చంద్రబాబు ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు పెట్టి జారుకుంటే...ఆ మొత్తాన్ని జగన్ తీర్చడమే కాదు...వాటికి ప్రోత్సాహకాలనూ అందిస్తూ...పారిశ్రామిక ప్రగతికి జగన్ అహరహం అడుగులు వేస్తున్నారు...ఆయన భరోసాయే పారిశ్రామికవేత్తలకు కొండంత అండ...ఏ వర్గానికీ మంచి జరగాలని చంద్రబాబు ఏనాడూ కోరుకోలేదు...రామోజీదీ అదే వరుస...అయినా వాస్తవాలు చెరిపేస్తే చెరిగిపోవు...చింపేస్తే చిరిగిపోవన్నది రామోజీ గుర్తించాలి...
సాక్షి, అమరావతి: తనవాడి పాలన అయితే తందాన తాన...తనకు నచ్చని వ్యక్తి అయితే ఎడాపెడా కారుకూతల రాతల విషం చిమ్మడం రామోజీకి అలవాటైపోయింది. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు అంటూ రాతలు రాస్తారు. అదే తనకు గిట్టని వాళ్లు అధికారంలో ఉంటే మాత్రం తిట్టిపోయడం రామోజీకి అలవాటై పోయింది. ఎంఎస్‌ఎంఈలకు బాబు పెట్టిన బకాయిలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీర్చినా సరే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనం ...అంటూ క్షుద్ర రాతలు రాస్తారు. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ వంటి మహమ్మారి కాలంలోనూ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమా మూత పడకుండా జగన్‌మోహన్‌రెడ్డి పారిశ్రామికవేత్తలను చేయిపట్టి నడిపించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగమే కనుక తిరోగమనంలో ఉండి ఉంటే గత ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ వాటా పెరగడం ఎలా సాధ్యమవుతుందో రామోజీ జవాబివ్వగలరా? 2019–20లో రాష్ట్ర జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి 23.36 శాతానికి చేరిన విషయం వాస్తవమో, కాదో రామోజీ బదులివ్వగలరా? పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన లేకపోయి ఉంటే తలసరి ఆదాయం ఎలా పెరిగిందో రామోజీ మట్టిబుర్రకు తట్టలేదా? గతేడాది దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే, మన రాష్ట్రంలో దాన్ని మించి రూ.26,931గా ఎలా పెరిగిందో ఈనాడు చెబుతుందా? 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరిన విషయం రామోజీకి తెలియదా?.
పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ప్రకటిస్తున్న సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్ర ఎగుమతులు రూ.90,000 కోట్ల నుంచి రూ.1,60,000 కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు హయాంలో 1.93 లక్షలుగా ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య ఇప్పుడు ఏకంగా ఏడు లక్షలు దాటింది. కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్‌ఆర్ నవోదయం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడం ద్వారా ఎంఎస్‌ఎందఈ రంగం ఎలా పురోగమించిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
గత బకాయిలను విడుదల చేసింది ఈ ప్రభుత్వమే రామోజీ ..
గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, జగన్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంది. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్ మిలు్లలకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకున్న విషయం వాస్తవం కాదా రామోజీ? గతంలో పట్టణాలు నగరాలకు దూరంగా ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక వాడలు పట్టణీకరణలో భాగంగా చాలాచోట్ల నగర మధ్య భాగంలోకి రావడంతో కాలుష్యకారక పరిశ్రమలను చాలా వరకు దూరప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. దీంతో పాత యూనిట్ల స్థలాలు వృధాగా ఉన్నాయి.
కొన్ని సంస్థలు వాటి వ్యాపార కార్యకలాపాలను మార్చుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత భూములను ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని పారిశ్రామిక సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి జీవో నెంబర్ 5, 6ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్యనూ తప్పు పడుతూ రామోజీ తన కలంతో ప్రభుత్వంపై విషం కక్కారు.
అన్ని మౌలికవసతులు కల్పిస్తూ అభివృద్ధి చేసిన భూమి ధర మార్కెట్ రేటు కంటే అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లాడినా అడిగినా చెబుతాడు. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని భూమి ధరలను నిర్ణయిస్తుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే పారిశ్రామిక పార్కుల్లో భూమి ధర ఎక్కువగా ఉందంటూ రామోజీ రాస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో రాష్ట్రమంతటికీ అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment