ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వృద్ధి 6 శాతం మాత్రమే
వ్యవసాయ రంగంలో వెనుకబాటు
పారిశ్రామిక రంగంలో ఐదో స్థానం సేవారంగంలో ఆరో స్థానం
అటవీ ఉత్పత్తుల్లో మాత్రం ఫస్ట్
నిత్యం ప్రగతి గురించి ప్రవచించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వృద్ధి రేటు మందగమనంగా ఉంది. పదమూడు జిల్లాల్లో వృద్ధిరేటును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సాక్షాత్తూ సీఎం బుధవారం కలెక్టర్ల సమావేశంలో జిల్లాలవారీగా వృద్ధిరేటును వెల్లడించారు. అటవీ ఉత్పత్తులు మినహా మిగిలిన అన్ని రంగాల్లో వెనుకబాటే కనిపించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం అట్టడుగున నిలిచింది. పారిశ్రామిక రంగమూ పెద్దగా ప్రగతి సాధించింది లేదు.
తిరుపతి: జిల్లా అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఒకట్రెండు మినహా మిగతా అన్ని రంగాల్లోనూ వెనుకబాటే కనిపిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగం నానాటికీ వెనుకబడిపోతోంది. సాగునీటి కొరత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జిల్లాలో వ్యవసాయ రంగం నానాటికీ దిగజారిపోయింది. కేవలం అటవీ ఉత్పత్తులు, పరిశ్రమల రంగంలోనే కొద్దోగొప్పో పురోగతి కనిపిస్తోంది. బుధవారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సర్కారు వివిధ రంగాల వారీగా విడుదల చేసిన గణాంకాలు దీన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన ప్పటికీ జిల్లా పూర్తిస్థాయిలో వృద్ధి రేటు 6 శాతమే కావడం గమనార్హం.
వ్యవసాయ రంగంలో 8వ ర్యాంక్
2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యవసాయం ఆశించిన మేర వృద్ధి కనిపించలేదు. ఈ రంగంలో జిల్లాకు 8వ స్థానం లభించింది. సాగునీరు, విత్తనాల కొరతతో పాటు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కొరవడటం,