పరి'శ్రమ'..?
అనుబంధ పరిశ్రమలపై సింగరేణి శీతకన్ను
- ఔత్సాహికులకు ప్రోత్సాహం కరువు
- ఎనిమిది నెలలుగా వర్క్ ఆర్డర్లు లేక ఇక్కట్లు
- బ్యాంక్ రుణాలు చెల్లించడానికి అభ్యర్థుల అగచాట్లు
- ముఖం చాటేస్తున్న ఉన్నతాధికారులు
ఇలా వీరిద్దరే కాదు.. దాదాపు పదిమూడు మంది వరకు పరిశ్రమలు పెట్టుకుని నేడు నిరుత్సా హంలో కొట్టుమిట్టాడుతున్నారు. గని కార్మికుల పిల్లల్ని పారిశ్రామికరంగంవైపు తీసుకురావాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. బయటి నుంచి తీసుకొస్తున్న సింగరేణికి అవసరమయ్యే చిన్నచిన్న పరికరాల్ని స్థానికంగానే తయారు చేయించాలనుకుని బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఔత్సాహికులను అను బంధ పరిశ్రమల స్థాపన కోసం 2013లో ఆహ్వానిం చింది. 13 మందిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరు బ్యాంకుల్లో రూ.10లక్షల నుంచి రూ.45లక్షల వరకు అప్పు తీసుకుని రూఫ్ బోల్టింగ్, వైండింగ్ వైర్, హౌజింగ్ వైర్, ఫిష్ ప్లేట్లు, జీఐ వైరింగ్ తదితర పరి కరాలు తయారీ పరిశ్రమలు పెట్టుకున్నారు.
సింగరేణి కొన్ని నెలలపాటు వీరికే ఆర్డర్లు ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో గానీ, దాదాపు ఎనిమిది నెలలుగా ఆర్డర్లను నిలిపివేసిందని పరిశ్ర మల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థను నమ్ముకుని లక్ష లు అప్పు చేసి ఫ్యాక్టరీలు పెట్టుకున్నామని, ఇప్పుడు వాటిని కట్టలేక నగలు, ఆస్తిపాస్తులు అమ్ముకునే స్థితి కి చేరుకున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా సంస్థ స్పందించి అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సా హం అందించాలని వేడుకుంటున్నారు.
ప్రోత్సహిస్తేనే బతుకుదెరువు
సింగరేణి యాజమాన్యం సంపూర్ణ సహకారం అందిస్తేనే తమకు బతుకుదెరువు లభిస్తుందని అనుబంధ పరిశ్రమల యజమానులు ఆర్.శ్రీని వాస్, సతీష్‌కుమార్, సాగర్, శంకరయ్య, నర్సిం హా, రాజేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింగరేణి స్టోర్స్‌లో విలేక రులతో వారు గోడు వెల్లబోసుకున్నారు. సంస్థను నమ్మి లక్షల రూపా యలు అప్పుతెచ్చి పరిశ్రమలు పెట్టామని, 8నెల లుగా వర్క్ ఆర్డర్లు లేకపోవడం తో ఆర్థిక సమ స్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.