
సాక్షి, అమరావతి : రాష్ట్ర బడ్జెట్‌లో పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏకంగా రూ.4,455 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,826.04 కోట్లు పారిశ్రామిక రాయితీలు, పరిశ్రమల ప్రోత్సాహకానికి కేటాయించడం విశేషం. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రూ.250 కోట్లు కేటాయించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రూ.856.64 కోట్లు కేటాయించింది.
రంగాలవారీగా కేటాయింపులు ఇలా..
పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక వసతుల కల్పనకు.. 696.61 కోట్లు
►ఈ మొత్తంలో ఓడరేవుల అభివృద్ధికి రూ.63.82 కోట్లు కేటాయింపు
►ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.632.79 కోట్లు
►సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక వసతుల అభివృద్ధి
►ఈ ఏడాది మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం
►భోగాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టడం
►ఈ ఏడాది 600 టెలికాం టవర్ల నిర్మాణం
►కడప ఎయిర్‌పోర్టులో నైట్ ల్యాండింగ్ సదుపాయం
►ఓర్వకల్లు విమానాశ్రయం పనులు పూర్తి చేసి ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం
పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు
►పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం
►అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు
►సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లు
►ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు రూ.180.77 కోట్లు
ఐటీలో 25 వేల మందికి ఉపాధి లక్ష్యం
►ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం కోసం రూ.197.37 కోట్ల బడ్జెట్ కేటాయింపులు
►ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఎగుమతులు పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి
►పారదర్శకత పెంచడానికి పరిపాలనలో నూతన టెక్నాలజీ వినియోగం పెంచడం
►స్టార్టప్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
►ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ ఏడాది 25 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యం
►ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.2,000 కోట్లు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.856.64 కోట్లు
►ఈ మొత్తంలో వ్యవసాయ రంగంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.279.09 కోట్లు కేటాయింపు
►ఐటీఐల్లో మౌలిక వసతుల పెంపునకు రూ.229.24 కోట్లు
►పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి రూ.348.31 కోట్ల కేటాయింపు
►ఎస్టీలకు అరకు, చింతపల్లి, భద్రగిరి, సీతంపేట, కేఆర్ పురంలో ఐటీఐల ఏర్పాటు
►మాచర్ల, కడపలో ఎస్సీల కోసం రెండు రెసిడెన్షియల్ ఐటీఐల నిర్మాణం
►టెక్నికల్ కాలేజీల్లో కాలానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకు సిలబస్ మార్పు
ఇతరాలు..
►జౌళి శాఖ, సహకార చక్కెర కర్మాగారాలు, ఆహార శుద్ధి, తదితరాలకు రూ.347.56 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment