పరిశ్రమలకు ప‘వర్రీ’
విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ సంక్షోభం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు నెలలుగా విధిస్తున్న అధికారి క, అనధికారిక కోతలతో పారిశ్రామిక రంగం కుదేలవగా....గోరు చుట్టుపై రోకలి పోటులా తాజాగా పారి శ్రామిక రంగానికి మళ్లీ అధికారిక కోతలు విధిస్తున్న ట్టు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పడిపోవడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడడంతో 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కోత లు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నెల రోజుల క్రితం పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కోతలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 6.30 గం టల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఆ సమయంలో పరిశ్రమల్లో కేవలం విద్యుత్ దీపాల వినియోగానికి మాత్రమే అనుమతిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పరిశ్రమల్లోని యంత్రాలను నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరి స్తున్నారు. విద్యుత్ కోతల విధింపుపై యాజమాన్యాల తో పాటు అటు కార్మికులు నష్టపోయే పరిస్థితి నెల కొంది. ఇప్పటికే జిల్లాలో గల ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఈనేపథ్యంలో అధికారిక కోతలు విధించటం వారిని కలవరపెడుతోంది.
గృహావసరాలకు తగ్గనున్న కోతలు
జిల్లాలోని గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు కోతలు వేళలు తగ్గనున్నాయి. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సి.శ్రీనివాసమూర్తి నూతనంగా అమలు చేసే కోతలను ప్రకటిం చారు. షెడ్యూల్ లోడ్‌రిలీఫ్ పేరిట విధించే కోతల్లో భాగంగా జిల్లా కేంద్రానికి రోజులో రెండు గంటలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రా లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు కోతలు విధించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కోతలను ఉత్పత్తి కేటాయింపుల పరిస్థితులను బట్టి అమలు చేయనున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మెరుగైన సరఫరా ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.