కరెంటు కష్టాలు మొదలు | The beginning of the current difficulties | Sakshi
Sakshi News home page

కరెంటు కష్టాలు మొదలు

Published Mon, Feb 16 2015 3:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

కరెంటు కష్టాలు మొదలు - Sakshi

కరెంటు కష్టాలు మొదలు

  •  పెరుగుతున్న డిమాండ్.. తగ్గుతున్న ఉత్పత్తి
  •  రోజుకు 15 ఎంయూలకుపైగా పెరిగిన డిమాండ్
  • సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో క్రమంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. గత రెండు వారాల్లో ఏకంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల (ఎంయూల)కుపైగా వాడకం పెరిగింది. విద్యుత్ లభ్యత, వినియోగం మధ్య ప్రస్తుతం మిలియన్ యూనిట్లకు పైనే తేడా కనిపిస్తోంది. దీంతో జిల్లాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోతలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, రైతులు రబీకి ఉపక్రమిస్తుండటంతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది.

    ఈ నెల మొదటి వారంలో 125 ఎంయూలున్న డిమాండ్ ఆదివారం నాటికి 144 ఎంయూలకు చేరింది. ఈ సమయానికి విద్యుత్ లభ్యత 143 ఎంయూలే ఉంది. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గుతోంది. రాష్ట్రంలో 2,810 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. ఇవి సక్రమంగా పనిచేస్తే రోజుకు 70 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం 64 మిలియన్ యూనిట్లకన్నా ఎక్కువ రావడం లేదు. రోజుకు 44 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన విజయవాడ ఎన్టీటీపీఎస్‌లో దాదాపు పది మిలియన్ యూనిట్ల లోటు కనిపిస్తోంది. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లోనూ ఇదే పరిస్థితి.

    రోజుకు 26 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సిన ఆర్టీపీపీలో 22 ఎంయూలకు మించడం లేదు. జల విద్యుత్ జాడేలేదు. ఇప్పటికైతే కొనుగోలు విద్యుత్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విపరీతమైన బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. అన్ని కేంద్రాల్లోనూ ప్రస్తుతం రెండు రోజులకు మించి స్టాక్ లేదు. మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)లోని కొన్ని యూనిట్లను వేసవిలో నిలిపేస్తారు. దీంతో మరింత బొగ్గు కొరత తప్పదు.

    ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గృహ, వాణిజ్య వినియోగం మార్చి ఆఖరు నుంచి రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీంతో మార్చి ఆఖరుకు రాష్ట్రంలో విద్యుత్ వాడకం 160 నుంచి 170 ఎంయూలకు చేరే వీలుంది. ప్రభుత్వం దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై కసరత్తు చేస్తోంది.
     
    నాలుగు జిల్లాల్లో కోతలు
    కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పగలు విద్యుత్ కోత విధిస్తున్నారు.
    కృష్ణా జిల్లాలో గ్రామాల్లో రెండు గంటలు, మండల కేంద్రాల్లో గంట కోతలు అమలవుతున్నాయినెల్లూరు జిల్లా పొదలకూరు, ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో పగలు మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు కోతలు అమలవుతున్నాయి.     {పకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లోనూ కోతలు అమలవుతున్నాయి.గుంటూరు జిల్లాలో రోజూ అర్ధగంట నుంచి గంట వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement