
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (2018–19) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మెరుగైన పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయింది. మార్చి నెలలో ఈ రేటు 4.6 శాతం కాగా, గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతంగా నమోదయ్యింది. మెరుగైన వృద్ధికి తయారీ, మైనింగ్ ప్రధాన కారణమయ్యాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన వివిధ విభాగాల వృద్ధి రేట్లను గమనిస్తే...
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో ఏప్రిల్ వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3 శాతం. 23 విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి.
♦ మైనింగ్: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 3 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది.
♦ విద్యుత్: వృద్ధి 5.4% నుంచి 2.1%కి తగ్గింది.
♦ క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు సంకేతంగా భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగం భారీ వృద్ధిని నమోదుచేసుకుంది. 13% వృద్ధి రేటు నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో –4.8% క్షీణత నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment