సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు గ్రీన్ సర్టీఫికేట్ అందిస్తున్న ఫిక్కీ ప్రెసిడెంట్ అనీష్ షా
కార్పొరేట్లపై సీతారామన్ విశ్వాసం
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచం దేశాభివృద్ధి లక్ష్యాలతో మమేకం అవుతుందన్న విశ్వాసమున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడంలో భాగస్వాములవుతాయని తెలియజేశారు. వెరసి శత వసంత స్వాతంత్య్ర దినోత్సవ (2047) సమయానికల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ తరాలకు అత్యుత్తమ భారత్‌ను అందించే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్‌ను సాధించేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ ః 2047: వికసిత్ భారత్– ఇండస్ట్రీ’ పేరుతో ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047కల్లా లక్ష్యాలను సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర కీలకమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment