చదువు పూర్తయింది. కోరుకున్న ఉద్యోగం. తోడు నీడలా ఉండే భర్త. తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని తెగ సంబరపడింది ఆ ఇల్లాలు. ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వపు మాధుర్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్న ఆ తల్లిని చూసి విధికి కన్ను కుట్టిందేమో.
అప్పుడే పుట్టిన కొడుకు మానసికంగా, శారీరకంగా పరిపక్వత రాకుండా అడ్డుకునే డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన పడ్డాడని తెలిసి ఆమె గుండె బద్దలైంది. దీనికి ఎగ్జిమా అనే చర్మ సమస్య కూడా తోడవడంతో ఆ క్షణం ఆమె జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లనిపించింది. నాకే ఎందుకిలా జరిగిందని కృంగిపోలేదు. అలా అని చూస్తూ కూర్చోలేదు. విధిని ఎదిరించింది. గెలిచి నిలబడింది. ఇంట్లో ఇల్లాలిగా ఉంటూ రూ.200 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఎంతో మంది మాతృ మూర్తులకు ప్రేరణగా నిలుస్తోంది.
చదవండి👉 చూడటానికి కిరాణా కొట్టు లాగే ఉంది.. నెలవారీ బిజినెస్ రూ.4 కోట్లకు పై మాటే
హరిణి శివకుమార్ ఎవరు?
1988లో వరదరాజన్ శివకుమార్ దంపతులకు హరిణి శివకుమార్ ఢిల్లీలో జన్మించారు.యావరేజ్ స్టూడెంటే అయినా చెన్నై కాలేజీ కామర్స్ డిగ్రీ, ఎంబీఏలో రీటైల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు.
22ఏళ్లకే వివాహం.. ఆవిరైన ఆనందం
విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఓ ప్రముఖ కార్పొరేట్ బ్యాంక్‌లో చేరారు. 22 ఏళ్ల వయసులో వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. చూస్తుండగానే పండంటి బిడ్డకు జన్మనించింది. కానీ పుట్టిన మగ బిడ్డ (బార్గవ్)కు డౌన్ సిండ్రోమ్, ఎగ్జిమా అనే చర్మ సమస్యలు ఉన్నాయని తెలిసి ఆమె ఆనందం ఆవిరైంది.
చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
ప్రతి సమస్యలోనూ ఓ అవకాశం
‘ప్రతి సమస్యలోనూ అవకాశాలు ఉంటాయి..ప్రయత్నించే వారికి దైవం కూడా సహకరిస్తుందనే నమ్మే ఆమె.. దృఢ నిశ్చయంతో పిల్లల చర్మ సమస్యలతో బాధపడే తనలాంటి తల్లుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు సొంతంగా సోప్స్ బిజినెస్ చేయాలనే ఆలోచన మొదలైంది హరిణికి. అదికి కూడా మార్కెట్‌లో దొరికే సువాసన భరిత, రసాయనాలతో కూడిన సబ్బులు పడవని తెలుసుకొని, ఇవి లేని సబ్బుల కోసం అన్వేషించింది.
శీకాకాయ, శెనగపిండి, మెంతులు, మందార, బీస్‌వ్యాక్స్, అవకాడో నూనె, ఆముదం నూనె, కొబ్బరి నూనె.. వంటి సహజసిద్ధమైన పదార్ధాలతో ఇంట్లోనే సబ్బుల తయారీ ప్రారంభించారు. ఆ సబ్బులతో సోరియాసిస్, ఎగ్జిమాలాంటి చర్మ సమస్యలకు పరిష్కారం చూపారు. ఎంతో మంది తల్లుల కడుపు కోత తీర్చి మాతృమూర్తి అయ్యారు.
చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
సోప్‌ఎక్స్
అలా మొదలైన బిజినెస్ ఆలోచనను ఆచరణలో పెట్టింది. కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన ఉత్పత్తులతో మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) ‘సోప్‌ఎక్స్ ఇండియా’ తన సొంత బ్రాండ్ పేరునే రిజిస్టర్ చేశారు. అదే బ్రాండ్ మీద సబ్బుల్ని తయారు చేసి ఇంటింటికి, వీధుల్లో, మార్కెట్లలో స్టాళ్లు పెట్టి అమ్మేవారు.
కామర్స్ స్టూడెంట్ కాస్త .. కాస్మోటిక్ కెమెస్ట్రీలో
రోజులు గడిచే కొద్దీ వ్యాపారం సవ్యంగా జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో తాను తయారు చేస్తున్న సబ్బుల్ని అమ్మాలని అనుకోలేదు. కానీ ఇంకెదో సాధించాలని అనుకున్నారు. సహజ పద్దతుల్ని చర్మాన్ని కాపాడేలా పదుల సంఖ్యలో ఉత్పత్తుల్ని తయారు చేసి అమ్మాలని భావించారు. అందుకే కామర్స్ డిగ్రీ చదివిన ఆమె 2016లో లిప‍్టిక్, షాంపూ,మేకప్ పౌండర్, నెయిల్ పాలిష్, టూత్ పేస్ట్, స్క్రిన్ కేర్ ప్రొడక్ట్‌లు, సన్ స్క్రీన్, బాడీ వాష్ వంటి ప్రొడక్ట్‌లను తయారు చేసే అర్హత సంపాదించేందుకు కాస్మోటిక్ కెమిస్ట్రీ కోర్స్‌లో చేరారు.
చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్
సోషల్ మీడియాలో విక్రయం
కోర్స్ పూర్తి చేసిన అనంతరం కాస్మోటిక్ ప్రొడక్ట్‌లను తయారు చేసి సొంతంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆమే సొంత వెబ్‌సైట్, బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వెబ్‌సైట్ తయారు చేయడం నుంచి ప్రొడక్ట్ ప్యాకేజింగ్, ప్రైసింగ్ ఇలా పనులన్నీ ఒక‍్కరే పూర్తి చేశారు.
చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ!
తండ్రికి తెగేసి చెప్పింది
ఒక రోజు హరిణి ఇంట్లో కాస్మోటిక్స్ ప్రొడక్ట్‌లను తయారు చేస్తుంది. అదే సమయంలో కొడుకు ఏడుస్తున్నా పట్టించుకోలేదని తండ్రి హరిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబం, వ్యాపారం ఒక్కటి కాదని.. రెండు వేర్వేరుగా చూడాలని, నువ్వు చేసేది చాలా తప్పని హెచ్చరించారు. అందుకు తాను బిజినెస్ చేయడం మానుకోలేనని తెగేసి చెప్పింది. దీంతో కుమార్తె హరిణి నిర్ణయాన్ని తండ్రి వరదరాజన్ శివకుమార్ అంగీకరించారు. ఆమెతో కలిసి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సహాయం చేశారు.
రూ.200 కోట్ల వ్యాపారం
2019లో సోప్‌ఎక్స్ బ్రాండ్‌ను ఎర్త్ రిథమ్ పేరుతో రీలాంచ్ చేశారు. 8 మంది మహిళా సిబ్బందితో గుర్‌గావ్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన రెండేళ్లలో ఆ సంస్థ 500 రెట్ల వృద్ది సాధించింది. 10రెట్లు కొనుగోలు చేసే కస్టమర్లు పెరిగారు. ఇప్పుడు ఆ సంస్థలో 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎర్త్ రిథమ్ వెబ్‌సైట్ నుంచి 160కి పైగా కాస్మోటిక్స్ ఉత్పత్తులు అమ్ముతున్నారు. ఎర్త్ రిథమ్ సంస్థ తయారు చేసిన షాంపూ బార్ ప్రొడక్ట్ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రసిద్ది చెందింది. ఎలాంటి వ్యాపార అనుభవం లేకుండా రూ.200 కోట్ల బ్రాండ్‌ను నిర్మించానని, తనలాగే ఎవరైనా చేయొచ్చని విజయ గర్వంతో చెబుతున్నారు.
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment