న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎక్కువ మంది మహిళా పారిశ్రామికవేత్తలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ‘భారతీయ యువ శక్తి ట్రస్ట్’ (బీవైఎస్‌టీ) నిర్వహించిన సర్వేలో తెలిసింది. దేశ రాజధాని ప్రాంతం, చెన్నై, పుణెకు చెందిన 450 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచు కున్నారు. బ్యాంకుల నుంచి కీలక ఆర్థిక సేవలను పొందడంలో తాము సమస్యలు ఎదుర్కొన్నట్టు 60 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా రుణాలు తీసుకునే విషయమై 85 శాతం మందికి సవాళ్లు ఎదురైనట్టు ఈ సర్వే వెల్లడించింది.
బీవైఎస్‌టీ సహకారంతో వచ్చే రుణ దరఖాస్తులను ఆహ్వనించేందుకు ప్రభుత్వరంగ బ్యంకులు సముఖంగా ఉన్నట్టు.. మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. రుణ దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించే ముందు తమ నిపుణుల ప్యానెల్ మదింపు వేస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment