ఫుకోవా (జపాన్): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కారం కావాల్సిన అవసరాన్ని బలంగా చెప్పింది. జపాన్ పోర్ట్ పట్టణం ఫుకోవాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒక్కతాటిపై నిలవగా, అమెరికా మాత్రం వేరుగా వ్యవహరించింది. ప్రతీ ఒక్కరు వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వృద్ధికి ముప్పుగా అభిప్రాయపడినట్టు, అమెరికా యంత్రాంగంలో ఈ తరహా భావన లేదని ఈయూ ఆర్థిక, మానిటరీ వ్యవహారాల కమిషనర్ పీరే మోస్కోవిసి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment