
న్యూఢిల్లీ: రష్యాతో రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐని అధీకృత బ్యాంకుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు.
త్వరలో రష్యా కూడా తమ దేశం తరఫున అధీకృత బ్యాంకును ఎంపిక చేసి, 15 రోజుల్లోగా ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాలు చెప్పినట్లు శక్తివేల్ వివరించారు.
ఎగుమతి, దిగుమతి లావాదేవీలను దేశీ కరెన్సీ మారకంలో నిర్వహించేందుకు అదనంగా ఏర్పాట్లు చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యా–భారత్ మధ్య సింహభాగం వాణిజ్యం డాలర్ మారకంలో కాకుండా రూపాయి మారకంలోనే జరుగుతోంది. ఉక్రెయిన్ మీద దాడులకు తెగబడినందుకు గాను రష్యాపై అమెరికా, యూరప్ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment