దావోస్ : ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరని, ఒకవేళ ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమవుతుందని చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్‌మా హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచీకరణను కొనసాగించాల్సివసరం ఉంటుందని, ఇది మన బాధ్యత అని జాక్ మా తెలిపారు. దీన్ని మెరుగుపరిచే అవకాశం కూడా మనదేనన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచంలో పెద్ద మొత్తంలో మార్పులు సంభవిస్తాయని ఆందోళన చెందుతుంటే, వ్యాధులు, వాతావరణ కాలుష్యం, పేదరికంపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు. ఎవరూ కూడా ప్రపంచీకరణను ఆపలేరని కూడా ఉద్ఘాటించారు. వాణిజ్య లావాదేవీలు, బాంబులాంటివన్నారు.
''ఎవరూ ప్రపంచీకరణను ఆపలేరు. ఒకవేళ ట్రేడ్ ఆపితే, ప్రపంచమే ఆగిపోతుంది. ట్రేడ్ కేవలం యుద్ధం బారి నుంచి బయటపడేయగలదు. కానీ యుద్ధాన్ని సృష్టించదు'' అని పేర్కొన్నారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం పరివర్తన దశలో ఉందని, ఇది ప్రజలకు ఆసక్తికరమైన కెరీర్‌లను సృష్టించడానికి సాయపడుతుందని తెలిపారు. కానీ కొన్ని సామాజిక సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వాణిజ్యం చాలా సాధారణంగా, ఆధునీకరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై మాట్లాడిన జాక్ మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ), మానవ వనరులకు పెద్ద ముప్పుగా మారుతోందని, భవిష్యత్తులో చాలా మందిని ఇది రీప్లేస్ చేస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగాలను ఏఐ, రోబోట్స్ హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ, మానవ వనరులకు మద్దతు ఇచ్చేలా ఉండాలని, టెక్నాలజీ ఎల్లప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేసేలా ఉండాలని కానీ, డిసేబుల్ చేసేలా ఉండకూడదన్నారు. ఈ శతాబ్దంలో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, అలీబాబాలు చాలా అదృష్టకర కంపెనీలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment