Alibaba founder Jack Ma
-
ఉద్యోగులకు జాక్ మా భారీ షాక్, వేలాది మందిపై వేటు!
అంతర్జాతీయ ఈకామర్స్ సంస్థ అలీబాబా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సంస్థ సేల్స్ తగ్గడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు అలీబాబా ఫౌండ్ జాక్ మా సుమారు 10వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అలీబాబా గ్రూప్ అనుబంధ మీడియా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. చైనా ప్రభుత్వ విధానాలతో వృద్దిరేటు పడిపోవడం, రెండేళ్ల క్రితం అలీబాబా డ్రాగన్ ప్రభుత్వంపై,నియంత్రణ సంస్థలపైనా అలీబాబా ఫౌండర్ జాక్‌మా విమర్శలు గుప్పించారు. నాటి నుంచి జాక్ మాపై దర్యాప్తు సంస్థలు ఉక్కు పాదం మోపుతూ వస్తున్నాయి. ఫలితంగా అలీ బాబా గ్రూప్ నష్టాల్లో కూరుకుపోతుంది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 22.74 బిలియన్ల యువాన్ల విక్రయాలు జరిపింది. గతేడాది 45.14 బిలియన్ల యువాన్ల విలువైన వస్తువుల అమ్మకాలు జరిపింది. అయితే ద్రవ్యోల్బణం, నష్టాల్ని తగ్గించుకునేందుకు జాక్ మా ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే 10వేల మంది ఉద్యోగుల్ని తొలగించారని, ఇప్పటి వరకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు తగ్గినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
ఏడాది తర్వాత ప్రత్యక్షమైన మల్టీబిలియనీర్
Billionaire Jack Ma reappears in Hong Kong: చైనా ప్రభుత్వం అక్కడి అపర కుబేరులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది చైనా ఆర్థిక నియంత్రణ చట్టాలను ఏకిపడేయడంతో.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. కిందటి ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు(ఆసియాలోనే అతిపెద్ద ఐపీవో!) బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి చాలాకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌లోని ఓ బిజినెస్ వేదిక వద్ద జాక్ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్ ఫైనాన్షియల్ హబ్ ఈవెంట్లో పాల్గొన్న జాక్ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్ చేశాడు. డ్రాగన్ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి. యాభై ఏడేళ్ల జాక్ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్ మా.. గతంలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్జౌ(పుట్టింది ఇక్కడే) కేంద్రంగా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌తో పాటు న్యూయార్క్‌లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది. చదవండి: బిట్‌కాయిన్.. చైనా బ్యాన్ ఎఫెక్ట్ నిల్! -
చైనా సంపన్నుడి సలహాపై నెటిజన్ల ఫైర్
బీజింగ్ : రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వారానికి ఆరు రోజులు పనిచేయాలని ‘996’ ఫార్ములాను ప్రతిపాదించిన అలీబాబా వ్యవస్ధాపకుడు, చైనా సంపన్నుడు జాక్ మా తాజాగా మరో సలహాతో ముందుకొచ్చారు. వారానికి ఆరు రోజులు, ఆరుసార్లు శృంగారంలో పాల్గొనాలని ఉద్యోగులకు సూచించారు. అలీబాబా గ్రూప్ ఉద్యోగుల సామూహిక వివాహ వేడుక సందర్భంగా చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్ మా ఈ ప్రతిపాదన చేసినట్టు డైలీ మెయిల్ వెల్లడించింది. పనిలో మనం ‘996’ను జీవితంలో ‘669’ను మనం ఫాలో కావాలని ఆయన చెప్పారు. కంపెనీ ప్రధాన కార్యాలయం హంగ్జూలో ఏటా మే 10న జరిగే సామూహిక వివాహాల సందర్భంగా 54 ఏళ్ల మా ఈ వ్యాఖ్యలు చేశారని డైలీ మెయిల్ పేర్కొంది. కాగా 996 పని ప్రతిపాదనను టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, తాజాగా ఆయన ప్రతిపాదించిన 669ను కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆఫీసులో 996 స్ఫూర్తితో పనిచేసిన తర్వాత ఇక ఇంట్లో 669 అమలు చేసేందుకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందని పలువురు నెటిజన్లు నిట్టూర్చారు. కాగా ‘669’ కోట్‌ను వైబోలో అలీబాబా అధికారిక పేజ్‌లో పోస్ట్ చేశారు. -
షాకింగ్ న్యూస్ చెప్పిన అలీబాబా కో ఫౌండర్
న్యూయార్క్ : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు,ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా షాకింగ్ న్యూస్ చెప్పారు. 420 బిలియన్ల డాలర్ల సంస్థనుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో దాతృత్వతను కొనసాగించేందుకు, పదవీ విరమణ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ అంశంపై సమాధానాన్ని దాటవేస్తూ తే వచ్చిన జాక్ చివరికి తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే అలీబాబా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా, కంపెనీ నిర్వహణ మార్గదర్శిగా కొనసాగుతారు. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. ఇటీవల దాతృత్వంపై మరింత దృష్టి కేంద్రీకరించడంపై ఆలోచిస్తున్నానంటూ, మైక్రోసాఫ్ట్ అధిపతి, దాత బిల్ గేట్స్‌ను ఉదాహరణగా పేర్కొన్న జాక్ చివరికి అన్నంత పనీ చేశారు. విద్య అంటే తనకు అమితమైన ప్రేమ అని అందుకే తన భవిష్యత్ సమయాన్ని ఇక విద్యకే కేటాయిస్తానని పేర్కొన్నారు. ఇది ముగింపు కాదని మరో కొత్త శకానికి నాంది అని చైనీస్ బిలియనీర్ జాక్ మా వ్యాఖ్యానించారు. అలీబాబా, టెన్సెంట్, బైడు, జెడి.కామ్ సంస్థలను తన ఆధ్వర్యంలో లాభాల దౌడు తీయించి, అమెరికన్ సంస్థలు అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల గుండెల్లో గుబులు రేపిన ఘనత జాక్ సొంతం.గత నెల వెల్లడించిన ఆలీబాబా త్రైమాసిక ఫలితాల్లో లాభాలు పడిపోయినప్పటికీ, అమ్మకాలలో 60 శాతం పురోగతి సాధించింది. కంపెనీ వార్షిక ఆదాయం సుమారు 40బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోవైపు చైనాలో టీచర్స్‌డేగా వ్యవహరించే (సెప్టెంబరు10, సోమవారం) ఆయన 54వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నారు. కాగా చైనా వ్యాపార దిగ్గజాలు యాభైవ పడిలో పదవికి రాజీనామా చేయడం చాలా అరుదని ఎనలిస్టులు చెబుతున్నారు. మల్టీబిలియన్ డాలర్ల ఇంటర్నెట్ దిగ్గజం ఆవిష్కారానికి ముందు జాక్ ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు.1999లోమరో 17మందితో కలిసి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఇ-కామర్స్, డిజిటల్ చెల్లింపుల సంస్థ ఆలీబాబాకు ప్రాణం పోశారు జాక్ మా. ఈ వార్తలపై జాక్‌మా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
'ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమే'
దావోస్ : ప్రపంచీకరణను ఎవరూ ఆపలేరని, ఒకవేళ ట్రేడ్ ఆగితే, యుద్ధం ప్రారంభమవుతుందని చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్‌మా హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచీకరణను కొనసాగించాల్సివసరం ఉంటుందని, ఇది మన బాధ్యత అని జాక్ మా తెలిపారు. దీన్ని మెరుగుపరిచే అవకాశం కూడా మనదేనన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచంలో పెద్ద మొత్తంలో మార్పులు సంభవిస్తాయని ఆందోళన చెందుతుంటే, వ్యాధులు, వాతావరణ కాలుష్యం, పేదరికంపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు. ఎవరూ కూడా ప్రపంచీకరణను ఆపలేరని కూడా ఉద్ఘాటించారు. వాణిజ్య లావాదేవీలు, బాంబులాంటివన్నారు. ''ఎవరూ ప్రపంచీకరణను ఆపలేరు. ఒకవేళ ట్రేడ్ ఆపితే, ప్రపంచమే ఆగిపోతుంది. ట్రేడ్ కేవలం యుద్ధం బారి నుంచి బయటపడేయగలదు. కానీ యుద్ధాన్ని సృష్టించదు'' అని పేర్కొన్నారు. టెక్నాలజీతో ప్రస్తుతం ప్రపంచం పరివర్తన దశలో ఉందని, ఇది ప్రజలకు ఆసక్తికరమైన కెరీర్లను సృష్టించడానికి సాయపడుతుందని తెలిపారు. కానీ కొన్ని సామాజిక సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వాణిజ్యం చాలా సాధారణంగా, ఆధునీకరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై మాట్లాడిన జాక్ మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ), మానవ వనరులకు పెద్ద ముప్పుగా మారుతోందని, భవిష్యత్తులో చాలా మందిని ఇది రీప్లేస్ చేస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగాలను ఏఐ, రోబోట్స్ హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ, మానవ వనరులకు మద్దతు ఇచ్చేలా ఉండాలని, టెక్నాలజీ ఎల్లప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేసేలా ఉండాలని కానీ, డిసేబుల్ చేసేలా ఉండకూడదన్నారు. ఈ శతాబ్దంలో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, అలీబాబాలు చాలా అదృష్టకర కంపెనీలని అన్నారు. -
కీలక పరిణామం: ట్రంప్‌తో అలీబాబా చైర్మన్ భేటీ
చైనా పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్‌కు, డ్రాగన్ దేశానికి ఈ మధ్యన అసలు పడటం లేదు. ట్రంప్ తమతో వైరానికి దిగితే తాము చూస్తూ ఊరుకోబోమంటూ డ్రాగన్ ఓ వైపు నుంచి హెచ్చరికలు కూడా జారీచేస్తోంది. ఈ కీలక సమయంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్, వ్యవస్థాపకుడు జాక్‌మా సోమవారం డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ భేటీలో చిన్న వ్యాపారాలకు సాయార్థం చైనాకు గూడ్స్ విక్రయించడానికి అమెరికాలో కొత్త ఉద్యోగాల సృష్టించాలనే దానిపై జాక్ మా ట్రంప్‌తో చర్చించారు. త్వరలో రాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు, చైనాకు మధ్య నెలకొన్న ఆందోళన నేపథ్యంలో వీరిద్దరు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. చైనాతో వాణిజ్యం సాగించడానికి అత్యధిక టారిఫ్‌లు వేస్తానని ఓవైపు నుంచి ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలను చైనీసులు కొట్టుకుని పోతున్నారని వాదిస్తున్నారు. అంతేకాక ఎన్నికల్లో అనూహ్య విజయానంతరం అమెరికా విదేశాంగ విధానానికి తూట్లు పొడిచి, తైవాన్ అధ్యక్షురాలితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇప్పటికే చైనా చాలా గుర్రుగా ఉంది. జాక్ మా, ట్రంప్ భేటీ మీటింగ్ ట్రంప్ టవర్‌లో జరిగింది. కంపెనీ ప్లాట్ ఫామ్స్ ద్వారా చిన్న, మధ్యతర బిజినెస్‌లకు అనుమతివ్వాలని, వీటివల్ల అమెరికాలో సృష్టించే 1 మిలియన్ ఉద్యోగాల ప్రణాళికపై చర్చించినట్టు అలీబాబా ట్వీట్ చేసింది. ఈ విషయంతో పాటు జాక్ మా, ట్రంప్‌తో భేటీ అవడానికి వెళ్లడం, ట్రంప్ టవర్‌లో వేచి చూస్తున్న జాక్ మా చిత్రాలను అలీబాబా పోస్టు చేసింది. 'జాక్, నేను కలిసి కొన్ని గొప్ప పనులు చేయబోతున్నాం' అని మీటింగ్ అనంతరం ట్రంప్ కూడా పేర్కొన్నారు. Jack Ma on the way to meet President Elect @realDonaldTrump to discuss $BABA plans to create 1MM US jobs by helping small biz sell to China. pic.twitter.com/Kca4kiwqPI — Alibaba Group (@AlibabaGroup) January 9, 2017