ముంబై: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనా దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యాపార రంగంలో తీవ్ర అలజడి నెలకొంది. మంగళవారం శాంతిని కోరుకుంటున్నట్లు భారత్ ప్రకటించినప్పటికి అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ముఖ్య అధికారలు తెలిపారు. ఇలాగే ఉద్రిక్తతలు కొనసాగితే చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు ఇబ్బందులు ఏర్పడతాయని, తాము ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని దేశీయ స్టార్ హెల్త్ఇన్సూరెన్స్ ఆఫీసర్ అనీష్ శ్రీవాస్తవ తెలిపారు.
ప్రపంచానికే అనేక వస్తువులను దిగుమతి చేస్తున్న చైనా.. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సంస్థ వ్యాపార వ్యూహాలు మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంక్షోభాలను దిగ్గజ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలవని.. గతంలో భారత్, చైనా యుద్ధం తరువాత ఇరు దేశాలు నిలదొక్కుకున్న విషయాన్ని షాంఘైకి చెందిన ఫండ్ మేనేజర్ దై మింగ్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులతో చైనా తయారీ రంగానికి ఎలాంటి నష్టం లేదని మింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ డాటా సెంటర్లను భారత్‌లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌసర్ అత్యధిక పేజీ వ్యూస్‌తో దేశీయ ప్రజలను ఆకట్టుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. కాగా చైనీస్ బ్రాండ్ షియోమీ స్మార్ట్‌ఫోన్ విభిన్న సిరీస్‌లతో దేశ ప్రజలను ఆకట్టుకుందని సంస్థ పేర్కొంది. యూఎస్‌కు బదులుగా దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి చైనా వైర్‌లెస్ నెట్‌వర్క్ దిగ్గజం హువావే టెక్నాలజీస్ 5జీనీ అందించేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. చైనా కంపెనీల నుండి సోర్సింగ్ పరికరాలను దేశీయ టెలికాం కంపెనీలు నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి అభిపప్రాయపడ్డారు.
ప్రైవేటు మొబైల్ ఫోన్ ఆపరేటర్లు ఉపయోగించే పరికరాలు భారత ప్రభుత్వం నిషేధించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా దేశీయ ఫార్మారంగం(రెడ్డీస్ ల్యాబ్, అరబిందో) కూడా చాలా వరకు ముడిపదార్థాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫార్మారంగం కొంత ఇబ్బంది ఎదుర్కొవచ్చని ఫార్మా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో పరికరాల కొనుగోలు తదితర అంశాల్లో డిఫెన్స్ రంగం గణనీయ వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.