జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ దాడుల నేపథ్యంలో ఇండియన్ టీ ఆసోసియేషన్ (ఐటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కోరితే పాకిస్తాన్ తో టీ వ్యాపారం రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐటీఏ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు నిర్ణయించినట్టు ఐటీఏ ఛైర్మన్ అజాం మెనం పీటీఐకి చెప్పారు. టీ వాణిజ్యానికి సంబంధించి పాకిస్తాన్ ముఖ్యమైనప్పటికీ, ఎగుమతులు నిలిపివేత ప్రభావం తమ వ్యాపారంపై అంతగా ఉండదన్నారు. ఈ అంశంలో తమకు టీ బోర్డు మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నానన్నారు.
దక్షిణ భారతంనుంచి80 శాతం, ఉత్తర భారతదేశం నుంచి 20 శాతం పాకిస్తాన్ టీ దిగుమతి చేసుకుంటుందని మెనం వివరించారు.
మొత్తం 230 మిలియన్ కేజీల ఎగుమతుల్లో పాకిస్తాన్ వాటా15 నుంచి 18 మిలియన్ కేజీలని వివరించారు. భారతదేశం యొక్క ఎగుమతి మార్కెట్లలో రష్యా, కజఖిస్తాన్, అమెరికా, చైనా, ఇరాన్, ఈజిప్ట్ , లాటిన్ అమెరికా ఉన్నాయన్నారు. సాధారణంగా శ్రీలంక, కెన్యాలనుంచి పాకిస్తాన్ టీ కొనుగోలు చేస్తుందని,ధరలు చవగ్గా ఉన్నపుడు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ప్లాంటేషన్ అసోసియేషన్ (సీసీపీఏ) ప్రెసిడెంట్ కూడా అయిన అజాం దక్షిణ భారత యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ కి కూడా విజ్ఞప్తి చేశారు.
టీ అసోసియేషన్ కీలక నిర్ణయం
Published Tue, Sep 20 2016 3:21 PM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM
Advertisement
Advertisement