
పొలాలకు రియల్ ఎస్టేట్ కాటు
- ప్లాట్లుగా మారుతున్న పంట భూములు
- ఏటా తగ్గుతున్న వ్యవసాయ విస్తీర్ణం
- చోడవరం ప్రాంతంలో మరీ తీవ్రం
చోడవరం,న్యూస్‌లైన్: పంట భూములన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఎక్కడిపడితే అక్కడ రియ ల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మెట్టభూములే కాకుండా ఏటా రెండు పంటలు పండే పల్లపు భూములు సైతం ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఈ పరి ణామం వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బ తీ స్తోంది. వ్యవసాయ విస్తీర్ణం తగ్గిపోయి ఆందోళనకు గురిచేస్తుంది.
పెట్టుబడులు భాగా పెరి గిపోవడం, పంటకు గిట్టుబాటుధర లేకపోవ డం వంటి కారణాలతో రైతులకు వ్యవసాయంపై ఆసక్తి తగ్గుతోంది. ఏడాదతా కష్టపడినా వ్యవసాయం ద్వారా కుటుంబ పోషణకు తగినంత రాబడి రావడంలేదని ఆందోళన చెందుతున్న రైతులు రియల్టర్ల మాయాజాలంలో పడుతున్నారు. బతుకుకు ఆసరాగా ని లిచే పంట భూములను అమ్మేసుకుంటున్నా రు.
రైతుల నైరాశ్యాన్ని ఆసరాగా చేసుకుం టున్న రియల్టర్లు తక్కువ ధరలకు భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చేసి కోట్లు సంపాదించుకుంటున్నారు. చోడవరం కేం ద్రంగా వందలాది ఎకరాల వ్యవసాయ భూ మి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోయింది. ఐదేళ్ల కిందట చోడవరాన్ని ఆనుకొని మాత్రమే మెట్టభూముల్లో ప్లాట్లు వేసేశారు. కాని ఇప్పు డు ఎక్కడ చూసినా ప్లాట్లే కనిపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో వ్యవసాయ విస్తీర్ణం కూడా బాగా తగ్గింది.
మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లో వ్యవసాయ విస్తీర్ణం ఏటేటా పెరుగుతుండగా చోడవరం మండ లం, దీనికి ఆనుకొని ఉన్న అనకాపల్లి, సబ్బవరం మండలాల్లో పంట విస్తీర్ణం తగ్గుతోంది. ఒక్క చోడవరం మండలంలోనే ఐదేళ్ల కిందట సుమారు 40వేల హెక్టార్లలో సేద్యం జరిగేది. అయితే ఇప్పుడు 30వేలహెక్టార్లలో మాత్రమే వ్యవసాయం జరుగుతోంది.
లక్ష్మీపురం, చీడికాడ రోడ్డు, వెంకన్నపాలెం, అనకాలపల్లి రో డ్డు, సబ్బవరం రోడ్లలో దారి పొడవునా రియ ల్ ఎస్టేట్ ప్లాట్లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు లో దీని ప్రభావం ఇంకెంత తీవ్రంగా ఉంటుం దోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.