Panel Discussion
-
అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి
ముంబై: రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘ కాల చర్యలను ఆర్బీఐ నియమించిన ప్యానెల్ సిఫారసు చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయంగ్ రైట్స్ (ఎస్డీఆర్) బాస్కెట్లో రూపాయిని చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్డీఆర్ అనేది ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులకు సంబంధించినది. సభ్య దేశాల అధికారిక రిజర్వ్‌లకు మద్దతుగా దీన్ని వినియోగిస్తుంటుంది. ఈ రిజర్వ్ కరెన్సీలను సభ్య దేశాలు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అంటే ఎస్‌డీఆర్‌లు అనేవి సభ్య దేశాల నిధుల అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది. ఎస్డీఆర్ బాస్కెట్లో ప్రస్తుతం యూఎస్ డాలర్, యూరో, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ మాత్రమే ఉన్నాయి. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ రాథో అధ్యక్షతన గల ప్యానెల్ ఈ సిఫారసులను ఆర్బీఐకి సమరి్పంచింది. ముందుగా ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా రూపాయి, స్థానిక కరెన్సీల్లో ఇన్వాయిస్, చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. భారత్‌లో, భారత్ బయట ఐఎన్ఆర్ ఖాతాలు తెరిచేలా ప్రోత్సాహించాలని కోరింది. -
అధ్యక్ష ఎన్నికలపై ఐఏఎఫ్‌సీ ప్యానల్ డిస్కషన్
డల్లాస్: ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో 'యూఎస్ పాలిటిక్స్ అండ్ రోల్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్' అనే అంశంపై చర్చ జరిగింది. అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇర్వింగ్‌లోని టచ్ నైన్ రెస్టారెంట్లో ఐఏఎఫ్‌సీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు అంశాలను లోతుగా చర్చించారు. ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్ డాక్టర్. ప్రసాద్ తోటకూర సమన్వయ కర్తగా వ్యవహరించిన 14 మంది సభ్యుల ప్యానల్ డిస్కషన్లో కొందరు డెమోక్రటిక్ పార్టీని, మరికొందరు రిపబ్లికన్ పార్టీని సపోర్ట్ చేస్తూ చర్చలో పాల్గొనగా.. ఇంకొందరు తటస్థంగా వ్యవహరిస్తూ చర్చను ముందుకు తీసుకెళ్లారు. ముందుగా ఐఏఎఫ్‌సీ టెక్సాస్ స్టేట్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల డిస్కషన్‌ను ప్రారంభిస్తూ.. ఎకానమి, హెల్త్ కేర్, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ఆర్ఐ లాంటి చర్చలోని ప్రధాన అంశాలను గూర్చి వివరించారు. అనంతరం ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఎన్నికైన 44 మంది అమెరికా అధ్యక్షుల్లో.. 18 మంది రిపబ్లికన్ పార్టీ తరఫున, 15 మంది డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికవగా.. 11 మంది ఇతర పార్టీల నుంచి ఎన్నికయ్యారని తెలిపారు. నవంబర్ 8న జరగనున్న ఎన్నికల్లో ఈ సారి అమెరికా అధ్యక్షుడు ఎవరా అనే దానిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇండో- అమెరికా సంబంధాల బలోపేతానికి కృషిచేసే అభ్యర్థులకు ఐఏఎఫ్‌సీ సపోర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్ఆర్ఐ ఓటర్లు నవంబర్ 8న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రసాద్ తోటకూర సూచించారు.