అధ్యక్ష ఎన్నికలపై ఐఏఎఫ్‌సీ ప్యానల్ డిస్కషన్ | IAFC Organizes Panel Discussion in Dallas on - US Presidential Elections | Sakshi
Sakshi News home page

అధ్యక్ష ఎన్నికలపై ఐఏఎఫ్‌సీ ప్యానల్ డిస్కషన్

Published Wed, Nov 2 2016 12:47 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

అధ్యక్ష ఎన్నికలపై ఐఏఎఫ్‌సీ ప్యానల్ డిస్కషన్ - Sakshi

అధ్యక్ష ఎన్నికలపై ఐఏఎఫ్‌సీ ప్యానల్ డిస్కషన్

డల్లాస్: ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో 'యూఎస్ పాలిటిక్స్ అండ్ రోల్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్' అనే అంశంపై చర్చ జరిగింది. అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇర్వింగ్‌లోని టచ్ నైన్ రెస్టారెంట్‌లో ఐఏఎఫ్సీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు అంశాలను లోతుగా చర్చించారు.

ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్ డాక్టర్. ప్రసాద్ తోటకూర సమన్వయ కర్తగా వ్యవహరించిన 14 మంది సభ్యుల ప్యానల్ డిస్కషన్‌లో కొందరు డెమోక్రటిక్ పార్టీని, మరికొందరు రిపబ్లికన్ పార్టీని సపోర్ట్ చేస్తూ చర్చలో పాల్గొనగా.. ఇంకొందరు తటస్థంగా వ్యవహరిస్తూ చర్చను ముందుకు తీసుకెళ్లారు. ముందుగా ఐఏఎఫ్‌సీ టెక్సాస్ స్టేట్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రావు కాల్వల డిస్కషన్‌ను ప్రారంభిస్తూ.. ఎకానమి, హెల్త్ కేర్, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ఆర్‌ఐ లాంటి చర్చలోని ప్రధాన అంశాలను గూర్చి వివరించారు.

అనంతరం ఐఏఎఫ్‌సీ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఎన్నికైన 44 మంది అమెరికా అధ్యక్షుల్లో.. 18 మంది రిపబ్లికన్‌ పార్టీ తరఫున, 15 మంది డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికవగా.. 11 మంది ఇతర పార్టీల నుంచి ఎన్నికయ్యారని తెలిపారు. నవంబర్ 8న జరగనున్న ఎన్నికల్లో ఈ సారి అమెరికా అధ్యక్షుడు ఎవరా అనే దానిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇండో- అమెరికా సంబంధాల బలోపేతానికి కృషిచేసే అభ్యర్థులకు ఐఏఎఫ్‌సీ సపోర్ట్ ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు నవంబర్ 8న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రసాద్ తోటకూర సూచించారు.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement