క్షీణించిన రూపాయి, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
క్షీణించిన రూపాయి, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
Published Wed, Oct 9 2013 10:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాలపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సందేహాలు వ్యక్తం చేయడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి బలహీన పడింది. మానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ రంగంలో పురోగతి మందగించడంతో 2013 సంవత్సరంలో వృద్ధి రేటును 5.7 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి ముగింపుకు రూపాయి 51 పైసలు కోల్పోయి 62.30 వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం రూపాయి 61.79 వద్ద ముగిసింది.
డాలర్, యూరో బలపడటం, రూపాయిపై ఒత్తిడి పెరిగడంతో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 19826 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. ఆతర్వాత నష్టాలనుంచి కోలుకుని ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో 19942 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
జయప్రకాశ్ అసోసియేట్స్, సన్ ఫార్మా, లుపిన్, హెచ్ సీఎల్ టెక్, టాటా మోటార్స్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, ఎస్ బీఐ, ఎం అండ్ ఎం, ఎన్ టీ పీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Advertisement