Interbank Foreign Exchange
-
మూడో రోజు బలపడిన రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో శుక్రవారం 35 పైసలు (0.56 శాతం) బలపడింది. 62.32 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 62.29 స్థాయిని సైతం తాకింది. రూపాయి గురువారం ముగింపు 62.67. వరుసగా మూడు రోజుల నుంచీ రూపాయి బలపడుతూ వస్తోంది. ఈ మూడు రోజుల్లో రూపాయి 125 పైసలు (1.97 శాతం) బలపడింది. డాలర్ అమ్మకాలు, దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. విదేశీ మార్కెట్లలో డాలరు బలహీనత కూడా రూపాయి విలువ పెరగడానికి కలసి వస్తోంది. -
ద్రవ్య మార్కెట్ లో బలపడిన రూపాయి
హైదరాబాద్: ప్రధాన బ్యాంకులు డాలర్ ను అమ్మకాలు జరపడంతో గురువారం మార్కెట్ లో రూపాయి బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజి లో నిన్నటి ముగింపుకు డాలర్ తో పోల్చితే రూపాయి 3 పైసలు లాభపడి 61.54 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత ఈక్విటీ మార్కెట్ లోకి విదేశీ నిధుల ప్రవాహం జోరందుకోవడం రూపాయి బలపడటానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతానికి చేరుకోవడం, పారిశ్రామిక ఉత్పత్తి 2.5 శాతంతో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం కూడా సానుకూలంగా మారింది. -
15 పైసలు నష్టపోయిన రూపాయి
ముంబై: బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఇంటర్ బ్యాంక్ ఎక్సేంజ్ వద్ద రూపాయి 15 పైసలు నష్టపోయింది. గ్లోబల్ మార్కెట్ లో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. శుక్రవారం క్లోజింగ్ లో రూపాయి 9 పైసలు బలపడి 61.36 వద్ద ముగిసింది. సోమవారం ప్రారంభంలో 15 పైసలు క్షీణించి 61.51 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉండగా భారత ఈక్వీటి మార్కెట్ లో సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో ప్రారంభమై.. 27969 పాయింట్ల నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. -
నెల గరిష్టానికి చేరుకున్న రూపాయి!
ముంబై: అమెరికన్ కరెన్సీ ఎగుమతిదారులు అమ్మకాలకు పాల్పడటంతో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి ఒకనెల గరిష్టాన్ని నమోదు చేసుకుంది. 60 రూపాయలకు దిగువన ట్రేడ్ కావడం గత నెల రోజుల్లో ఏప్రిల్ 9 తర్వాత ఇదే తొలిసారి. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చెంజ్ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 59.94 వద్ద్ర ట్రేడ్ అవుతోంది. బుధవారం రూపాయి 60.13 వద్ద ముగిసింది. గురువారం ఇంట్రా డే ట్రేడింగ్ లో రూపాయి 59.94 గరిష్టాన్ని, 60.05 కనిష్టాన్ని నమోదు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం 1.45 సమయానికి 60.02 వద్ద ట్రేడ్ అవుతోంది. -
60 దిగువకు రూపాయి
ముంబై: ఎట్టకేలకు దేశీ కరెన్సీ 60 దిగువకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 40 పైసలు బలపడటంతో ఎనిమిది నెలల తరువాత మళ్లీ 59.91కు చేరింది. ఇంతక్రితం జూలై 29న మాత్రమే ఈ స్థాయిలో 59.41 వద్ద ముగిసింది. ప్రధానంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో రూపాయికి బలం చేకూరుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటం కూడా సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలి పారు. దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు శుక్రవారంతో కలిపి 5 రోజుల్లో రూ. 7,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయడం ఇందుకు సహకరించిందని వివరించారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం ఒక దశలో 63 పైసల వరకూ లాభపడ్డ రూపాయి 59.68 వద్ద గరిష్టాన్ని కూడా తాకింది. చివరికి 0.66%(40 పైసలు) పుంజుకుని 59.91 వద్ద స్థిరపడింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రూపాయిపై ప్రతి కూల ప్రభావంపడే అవకాశమున్నదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ రమేష్ సింగ్ వ్యాఖ్యానించారు. -
29 పైసలు క్షీణించిన రూపాయి
ముంబై: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో దేశీ కరెన్సీపైనా ప్రతికూల ప్రభావం పడింది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 29 పైసలు నష్టపోయి 62.04కు దిగజారింది. గడిచిన రెండు వారాల వ్యవధిలో ఇదే అత్యధిక క్షీణత కావడం గమనార్హం. డిసెంబర్ క్వార్టర్లో జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరచడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
బలపడిన రూపాయి, భారీ లాభాల్లో సెన్సెక్స్!
ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, ఫండ్స్ కొనుగోళ్లకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు సెషన్లలో 674 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం ఉదయం 223 పాయింట్లు లాభపడి 20440 వద్ద ప్రారంభమైంది. బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్, ఇతర రంగాల షేర్లలో రికవరీ కనిపించింది. మరో ప్రధాన సూచీల 68 పాయింట్లు లాభపడి 6064 పాయింట్ల నమోదు చేసుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 277 పాయింట్లతో 20495, నిఫ్టీ 85 పాయింట్ల వృద్దితో 6081 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, జయప్రకాశ్ అసోసియేట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్ టీపీసీ లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకులు, ఎగుమతుదారులు అమెరికా డాలర్ ను అమ్మకాలు జరపడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజి వద్ద ఆరంభంలోనే రూపాయి 31 పైసలు బలపడింది. వివాదస్పద న్యూక్లియర్ కార్యక్రమంపై ఇరాన్, అగ్రరాజ్యాల మధ్య ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ కు వ్యతిరేకంగా యూరో బలపడటం రూపాయి బలపడటానికి కారణం అని ఫారెక్స్ డీలర్స్ తెలిపారు. ప్రస్తుతం 37 పైసల లాభంతో 62.50 వద్ద ట్రేడ్ అవుతోంది. -
క్షీణించిన రూపాయి, స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాలపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సందేహాలు వ్యక్తం చేయడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి బలహీన పడింది. మానుఫాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ రంగంలో పురోగతి మందగించడంతో 2013 సంవత్సరంలో వృద్ధి రేటును 5.7 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి ముగింపుకు రూపాయి 51 పైసలు కోల్పోయి 62.30 వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం రూపాయి 61.79 వద్ద ముగిసింది. డాలర్, యూరో బలపడటం, రూపాయిపై ఒత్తిడి పెరిగడంతో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 19826 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. ఆతర్వాత నష్టాలనుంచి కోలుకుని ప్రస్తుతం 40 పాయింట్ల నష్టంతో 19942 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జయప్రకాశ్ అసోసియేట్స్, సన్ ఫార్మా, లుపిన్, హెచ్ సీఎల్ టెక్, టాటా మోటార్స్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్ టెల్, ఎస్ బీఐ, ఎం అండ్ ఎం, ఎన్ టీ పీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.