మూడో రోజు బలపడిన రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో శుక్రవారం 35 పైసలు (0.56 శాతం) బలపడింది. 62.32 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 62.29 స్థాయిని సైతం తాకింది. రూపాయి గురువారం ముగింపు 62.67. వరుసగా మూడు రోజుల నుంచీ రూపాయి బలపడుతూ వస్తోంది.
ఈ మూడు రోజుల్లో రూపాయి 125 పైసలు (1.97 శాతం) బలపడింది. డాలర్ అమ్మకాలు, దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. విదేశీ మార్కెట్లలో డాలరు బలహీనత కూడా రూపాయి విలువ పెరగడానికి కలసి వస్తోంది.