డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్ ఇండెక్స్(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 84.41 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84.51 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment