minimum level
-
రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి..
డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్ ఇండెక్స్(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 84.41 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84.51 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. -
దశాబ్ద కనిష్టానికి మొండి బాకీలు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 3.8 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. చివరిసారిగా 2014 మార్చి త్రైమాసికంలో ఈ స్థాయి ఎన్పీఏలు నమోదయ్యాయి. ఈమధ్యే ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 5.9 శాతం నుంచి 4.2 శాతానికి దిగి వచ్చి ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ విషయాలు వెల్లడించింది. అధిక విలువ గల కార్పొరేట్ రుణ పద్దులకు సంబంధించిన ఎన్పీఏల పరిస్థితి మెరుగుపడుతున్నట్లు తెలిపింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2 శాతం దిగువకు తగ్గవచ్చని పేర్కొంది. కార్పొరేట్లు తమ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రీ–పేమెంట్ సహా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రిస్కు నిర్వహణ, అండర్‌రైటింగ్‌ను పటిష్టం చేసుకోవడం తదితర అంశాలు కూడా బ్యాంకులు.. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తోడ్పడుతున్నాయి. రిటైల్ విభాగంలో తనఖా లేని రుణాల మంజూరు పెరుగుతున్నప్పటికీ.. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో వాటి వాటా చాలా తక్కువే ఉంటుందని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. బ్యాంకింగ్ రంగం మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 26 శాతంగా ఉంటాయని.. వీటిలో సగం గృహ రుణాలు, నాలుగో వంతు వాటా వాహన రుణాలది ఉంటుందని తెలిపారు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు మొదలైన అన్నింటి వాటా రిటైల్ పోర్ట్‌ఫోలియోలో నాలుగో వంతుగా ఉంటుందన్నారు. నెమ్మదించనున్న వడ్డీ మార్జిన్లు.. వడ్డీ రేట్ల పెంపుదలతో గత ఆర్థిక సంవత్సరం ఆసాంతం పెరుగుతూ వచ్చిన నికర వడ్డీ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో నెమ్మదించవచ్చని సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభ పరిస్థితులు ఎలా ఉన్నా దేశీ బ్యాంకింగ్ రంగం ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొనగలదని పేర్కొన్నారు. భారత్‌లో వడ్డీ రేట్ల పెంపు తక్కువ స్థాయిలో ఉండటం, రికార్డు కనిష్ట స్థాయికి తగ్గుతున్న మొండి బాకీలతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం తదితర అంశాలు ఇందు కు దోహదపడగలవని సీతారామన్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారీ రుణ వృద్ధి 15 శాతం స్థాయిలో కొనసాగవచ్చని పేర్కొన్నారు. అసెట్ క్వాలిటీపై ఆందోళన తగ్గుతున్న నేపథ్యంలో నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) పెరగవచ్చని తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ఏయూఎం 13–14 శాతం పెరగవచ్చని సీతారామన్ వివరించారు. -
గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత పెరగడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాల ఊతంతో హోమ్ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత హౌసింగ్‌కు డిమాండ్ పుంజుకోవడంతో పండుగ సీజన్ సందర్భంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు 6.5 శాతానికే హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ‘గత కొన్నాళ్లుగా ఆదాయ స్థాయులు ఎంతో కొంత పెరగ్గా దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉండిపోయాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహాలు మరింత అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. చౌక వడ్డీ రేట్లు కూడా గృహ రుణాలు తీసుకోవడానికి ఒక కారణంగా నిలుస్తున్నాయి. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు కాస్త పెద్ద సైజు అపార్ట్మెంట్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు’ అని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణు సూద్ కర్నాడ్ తెలిపారు. రెడీమేడ్ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటోందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. పండుగ సీజన్, ఆ తర్వాత కూడా రెడీమేడ్ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు పలు బ్యాంకులు, పండుగ సీజన్‌కు ముందే గృహ రుణాల రేట్లను తగ్గించాయని కోలియర్స్ ఇండియా కొత్త సీఈవో రమేష్ నాయర్ చెప్పారు. -
కనిష్ట స్థాయికి కశ్మీర్ ఉగ్రవాదం: జవదేకర్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దయ్యాక కశ్మీర్లో ఉగ్రవాదం కనిష్ట స్థాయికి చేరుకుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ‘ఆర్టికల్ 370, 35ఏ రద్దు అమల్లోకి వచ్చాక గడచిన 4 నెలల్లో ఉగ్రవాదం కనిష్ట స్థాయికి చేరింది. గతంలో ఉగ్రవాదానిదే పైచేయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రజా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది’ అని అన్నారు. కశ్మీర్ అభివృద్ధికి కొత్త అవకాశాలు పెరిగాయని అన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అన్ని వర్గాల వారు శాంతిపూర్వకంగా స్వీకరించారని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటనలు దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచాయన్నారు. -
మూడేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
డిసెంబర్లో 3.41 శాతం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత– రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో మూడేళ్ల కనిష్ట స్థాయి 3.41 శాతానికి పడిపోయింది. అంటే 2015 డిసెంబర్లో కొన్ని వస్తువుల బాస్కెట్ ధరను 2016 డిసెంబర్‌తో పోల్చిచూస్తే... ధరలు 3.41 శాతం పెరిగాయన్నమాట. కాగా 2015 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతంకాగా, 2015 డిసెంబర్లో 5.61 శాతం. తాజా గణాంకాలను చూస్తే,... డిసెంబర్ నెలలో కొన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడి డిమాండ్ తగ్గడంతో పాటు కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇందుల్లో వేర్వేరు కీలక విభాగాలను చూస్తే... • ఆహారం, పానీయాలు: ధరల పెరుగుదల 1.98%గా ఉంది. • పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరితాలు: 6.39% ధరల పెరుగుదల • దుస్తులు, పాదరక్షల విభాగం: ధరల పెరుగుదల రేటు 4.88 శాతం • హౌసింగ్: ఈ రంగంలో రేటు పెరుగుదల 4.98 శాతం • ఇంధనం, లైట్: ధరల పెరుగుదల రేటు 3.77 శాతం నిత్యావసరాలను చూస్తే: డిసెంబర్లో కూరగాయలు ధరలు అసలు పెరక్కపోగా, 2015 డిసెంబర్ ధరతో పోల్చితే –14.59 శాతం క్షీణత నమోదయ్యింది. పప్పు దినుసుల ధరలు కూడా ఇదే రకంగా –1.57 శాతం క్షీణించాయి. అయితే చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధరలు మాత్రం భారీగా 21.06 శాతం ఎగశాయి. -
జూన్‌లో సేవల రంగం పేలవం: నికాయ్ పీఎంఐ
న్యూఢిల్లీ: దేశీ సేవల రంగం జూన్ నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు నెలల నుంచీ ప్రతికూలంగా ఉన్న ఈ రంగం తాజా సమీక్ష నెలలో ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. కొత్త ఆర్డర్లు లేకపోవడం ఈ రంగం మందగమనానికి కారణంగా నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పేర్కొంది. సూచీ మేలో 51 పాయింట్ల వద్ద ఉంటే, జూన్‌లో 50.3 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు సేవలు, తయారీ రంగాల పనితీరును సూచించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మేలో 50.9 పాయింట్ల వద్ద ఉండగా, జూన్‌లో ఇది 51.1 పాయింట్లకు పెరిగింది. కాగా, ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. -
కాస్త కోలుకున్న రూపాయి
ముంబై: దాదాపు 20 నెలల కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకుంది. శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు రికవర్ కావటంతో బ్యాంకులు, ఎగుమతిదారులు తాజాగా డాలర్లను విక్రయించారు. దీంతో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ తగ్గి... రూపాయి దాదాపు 29 పైసల మేర పెరిగి 63.94 వద్ద ముగిసింది. గురువారం నాడు దేశీ కరెన్సీ ఏకంగా 69 పైసలు క్షీణించి 20 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే.