న్యూఢిల్లీ: దేశీ సేవల రంగం జూన్ నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు నెలల నుంచీ ప్రతికూలంగా ఉన్న ఈ రంగం తాజా సమీక్ష నెలలో ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. కొత్త ఆర్డర్లు లేకపోవడం ఈ రంగం మందగమనానికి కారణంగా నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పేర్కొంది. సూచీ మేలో 51 పాయింట్ల వద్ద ఉంటే, జూన్‌లో 50.3 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు సేవలు, తయారీ రంగాల పనితీరును సూచించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మేలో 50.9 పాయింట్ల వద్ద ఉండగా, జూన్‌లో ఇది 51.1 పాయింట్లకు పెరిగింది. కాగా, ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.