Domestic services sector
-
వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఓకే?
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. మామునూరులో ఉన్న పురాతన ఎయిర్ స్ట్రిప్ స్థానంలో దీనిని నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించినా, పౌర విమానయాన శాఖ–రాష్ట్రప్రభుత్వం మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే వీటి ఏర్పాటు సందిగ్ధంలో పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చి దశలవారీగా ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. తొలుత వరంగల్‌లో విమానాశ్రయాన్ని సిద్ధం చేసే కసరత్తులో భాగంగా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కోరిన మేరకు భూమిని సేకరించి అప్పగించనుంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సమావేశ ఎజెండాలో కూడా దీనిని చేర్చారు. 250 ఎకరాల భూసేకరణ మామునూరులో నిజాంకాలంలో నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇది వాడుకలో లేదు. అక్కడ చిన్నòÙడ్డు తప్ప ఎలాంటి భవనం లేదు. ఒక పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే ఉంది. గోతులు పడి అది కూడా వినియోగించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఆ ఎయిర్‌స్ట్రిప్‌కు సంబంధించిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అ«దీనంలో ఉంది. అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అంతమేర భూసేకరణ జరగాల్సి ఉంది. సమీపంలోనే పశసంవర్థక శాఖ కు చెందిన స్థలం అందుబాటులో ఉంది. కొంత సమీప గ్రామం నుంచి సేకరించాల్సి ఉంది. గ్రామస్తులకు ఎయిర్‌పోర్టుకు మరోవైపు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్‌కు ఈమేర కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఏడాదిన్నరలో సిద్ధం చేసేలా.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని రూ.350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌స్ట్రిప్‌లో 1400 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాని పక్కనే గ్లైడర్స్ దిగేందుకు అప్పట్లో మరో చిన్న రన్‌వే నిర్మించారు. ఇప్పుడు 2300 మీటర్ల పొడవుతో ఒకటే రన్‌వే కొత్త విమానాశ్రయం కోసం సిద్ధం చేస్తారు. రన్‌వే విస్తరణ, టెర్మి నల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్విసెస్‌కు ఈ అదనపు భూమి అవసరమవుతోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది క్వార్టర్లను మరో చోట నిర్మించాలని నిర్ణయించారు. భూమిని సేకరించి అథారిటీకి అప్పగించిన ఏడాదిన్నరలోగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తు తం దేశీయ విమానాశ్రయం (డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు)గానే ఏర్పాటు చేయనున్నారు. 500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది రూపొందనుంది. భవిష్యత్ అవసరాల ఆధారంగా విస్తరిస్తారు. దశలవారీగా ఇతర చోట్ల కూడా.. వరంగల్ మామునూరుతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వీటిని దశలవారీగా చేపట్టాలని ఇప్పుడు నిర్ణయించారు. హైదరాబాద్ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వరంగల్ కావటం, అక్కడ టెక్స్‌టైల్‌పార్కు, ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ తొలుత విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆకాశ వీధిలో..
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ సర్వీసులుపరుగులు తీస్తున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మొదట్లో విమాన యానంపై ప్రయాణికులు వెనకంజ వేశారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఎయిర్‌పోర్టులో అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులు అంతంత మాత్రంగానే నడిచాయి. రెండు నెలల లాక్డౌన్అనంతరం మే 25న ప్రారంభమైన విమాన సర్వీసులు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ప్రతి రోజు 126విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే రద్దీతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య తక్కువే. అత్యవసరమైతేనే రాకపోకలు సాగిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదట్లో కొన్ని నగరాలకు సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం ముంబై, చెన్నైలతో పాటు సుమారు 40కిపైగా నగరాలకు దేశీయ విమానాలు క్రమం తప్పకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, విజయవాడ, వైజాగ్, కడప, «త్రివేండ్రం, కొచ్చి, బెంగళూరు, భోపాల్, లక్నో తదితర నగరాలకు ప్రయాణికులు వెళ్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు 63 విమానాలు నగరానికి చేరుకుంటుండగా మరో 63 హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు బయలుదేరి వెళ్తున్నాయి. ప్రతి రోజు 6,300 మంది హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మరో 6,200 మంది ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నారు. రాకపోకలు ఇలా.. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత మే 25న దేశీయ విమానాలకు కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో మొదటి రోజు 20 విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరగా, మరో 19 విమానాలు నగరానికి చేరుకున్నాయి. సుమారు 3వేల మంది ప్రయాణం చేశారు. మొదటి రోజు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని విద్యానగర్‌కు బయలుదేరిన మొదటి ట్రూజెట్ విమానంలో కేవలం 12 మంది బయలుదేరడం విశేషం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఏసియా విమానంలో 106 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. రెండోరోజు 2500 మంది రాకపోకలు సాగించారు. ఆపరేషన్లు ప్రారంభమైన 3వ రోజు 3,500 మంది ప్రయాణం చేశారు. మూడో రోజు 41 విమానాలు వివిధ నగరాలకు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా, ట్రూజెట్ తదితర ఎయిర్‌లైన్స్ సంస్థలు కేంద్ర విమానయాన సంస్థ ఆదేశాలకనుగుణంగా పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. ప్రస్తుతం 126 సర్వీసులు రాకపోకలు సాగించడం గమనార్హం. సాధారణ రోజుల్లో 460 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతాయి. రోజుకు 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. కోవిడ్ దృష్ట్యా రాకపోకలు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నెల ముగిసిన పిదపే.. మరోవైపు అంతర్జాతీయ విమానాలకు ఇప్పట్లో అనుమతి లభించకపోవచ్చని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అంతా అనుకూలంగా ఉంటే ఆగస్ట్‌లోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావచ్చని జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సొంత రాష్ట్రాలకు తరలించేందుకు వందేభారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాలను నడిపారు. త్వరలో మరిన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికులే స్వయంగా ఏర్పాటు చేసుకొనే చార్టెడ్ విమానాలు కూడా పలు దేశాల నుంచి రాకపోకలు సాగించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వైరస్ వ్యాపించకుండా ఎయిర్‌పోర్టులో పటిష్టమైన రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు అన్ని చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. బ్యాగేజ్ కోసం శానిటైజ్ టన్నెల్స్ పని చేస్తున్నాయి. సెల్ఫ్ చెక్ ఇన్, భౌతికంగా తాకేందుకు అవసరం లేని పద్ధతిలో తనిఖీలను కొనసాగిస్తున్నారు. -
ఎయిర్పోర్ట్ 24/7కు లైన్‌క్లియర్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంక్షల బెడద తొలగిపోయింది. ఈ ఎయిర్‌పోర్టు ఇక 24 గంటలూ పౌర విమాన సర్వీసులు నడపడానికి రక్షణ మంత్రిత్వశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రక్షణశాఖ అధీనంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టులోకి పౌర విమానాల రాకపోకలపై కొన్నాళ్ల క్రితం నేవీ ఆంక్షలు విధించింది. నేవీ యుద్ధ విమానాల రాకపోకలు, విన్యాసాలు, సిబ్బందికి శిక్షణ వంటి మిలట్రీ ఆపరేషన్ల కోసం నవంబర్ ఒకటో తేదీ నుంచి రోజూ ఉదయం 9.30 నుంచి 12.30, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఐదు గంటల పాటు పౌర విమానాలపై నిషేధం విధించింది. మంగళ, గురువారాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కూడా పౌర విమానాలు రాకపోకలు సాగించరాదని ఆంక్షలు పెట్టింది. దీంతో ఈ ఆంక్షల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని కొన్ని పౌర విమానయాన సంస్థలు విశాఖకు తమ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్టు, మరికొన్ని సంస్థలు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాయి. రక్షణ శాఖ ఆంక్షల నిర్ణయంపై ప్రయాణికుల నుంచే కాక వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ వర్గాలు, ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్(ఏపీఏటీఏ) నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అంతేకాదు.. ఆంక్షలను సడలించకపోతే ఆందోళనకు సైతం సమాయత్తమయ్యారు. పరిస్థితిని గమనించిన రక్షణశాఖ అధికారులు తొలుత ఐదు గంటల నిషేధాన్ని మూడు గంటలకు కుదిస్తామని దిగివచ్చినా అంగీకరించలేదు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపై నేవీ ఆంక్షల ప్రభావం ఎలా చూపుతుందో ఏపీఏటీఏ నేతృత్వంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రాలు అందజేశారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఎయిర్‌పోర్టుపై నేవీ ఆంక్షల ఎత్తివేయాలని రక్షణమంత్రిని కోరారు. అనంతరం జులై 14న రక్షణశాఖ పౌర విమానాల సమయాలపై విధించిన ఆంక్షల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ విమానాశ్రయంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా 24 గంటలూ పౌర విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్లో వెల్లడించారు. దీంతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంపై పౌర విమానాల రాకపోకలపై నిషేధం అధికారికంగా తొలగినట్టయింది. కొత్త సర్వీసులకు అవకాశం విశాఖ విమానాశ్రయం పౌర విమానాల వేళలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు గతంలో నేవీ ప్రకటన నేపథ్యంలో ఈ ఎయిర్‌పోర్టుకు కొత్తగా ఒక అంతర్జాతీయ (థాయ్‌లాండ్‌కు), 8 డొమెస్టిక్ విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చాయి. వీటి షెడ్యూళ్లు వచ్చే నెలలో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి రోజూ 70 పౌర విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ విమానాశ్రయం నుంచి విమానాలు దేశ, విదేశాలకు రాకపోకలు జరుగుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు రక్షణ మంత్రి సాక్షాత్తూ ప్రకటించడంతో విమానయాన సంస్థల్లో నమ్మకాన్ని పెంచినట్టు అయిందని ఏపీఏటీఏ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ, విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఓ.నరేష్‌కుమార్‌లు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విమానాశ్రయానికి మరిన్ని కొత్త సర్వీసుల రాకతో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
జూన్‌లో సేవల రంగం పేలవం: నికాయ్ పీఎంఐ
న్యూఢిల్లీ: దేశీ సేవల రంగం జూన్ నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. వరుసగా మూడు నెలల నుంచీ ప్రతికూలంగా ఉన్న ఈ రంగం తాజా సమీక్ష నెలలో ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. కొత్త ఆర్డర్లు లేకపోవడం ఈ రంగం మందగమనానికి కారణంగా నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పేర్కొంది. సూచీ మేలో 51 పాయింట్ల వద్ద ఉంటే, జూన్‌లో 50.3 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు సేవలు, తయారీ రంగాల పనితీరును సూచించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ మేలో 50.9 పాయింట్ల వద్ద ఉండగా, జూన్‌లో ఇది 51.1 పాయింట్లకు పెరిగింది. కాగా, ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.