![Terrorism At Minimum After Article 370 Move In Kashmir - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/1/javadeka.jpg.webp?itok=klqGQsWO)
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దయ్యాక కశ్మీర్‌లో ఉగ్రవాదం కనిష్ట స్థాయికి చేరుకుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ‘ఆర్టికల్ 370, 35ఏ రద్దు అమల్లోకి వచ్చాక గడచిన 4 నెలల్లో ఉగ్రవాదం కనిష్ట స్థాయికి చేరింది. గతంలో ఉగ్రవాదానిదే పైచేయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రజా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది’ అని అన్నారు. కశ్మీర్ అభివృద్ధికి కొత్త అవకాశాలు పెరిగాయని అన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అన్ని వర్గాల వారు శాంతిపూర్వకంగా స్వీకరించారని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటనలు దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment