ద్రవ్య మార్కెట్ లో బలపడిన రూపాయి
హైదరాబాద్: ప్రధాన బ్యాంకులు డాలర్ ను అమ్మకాలు జరపడంతో గురువారం మార్కెట్ లో రూపాయి బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజి లో నిన్నటి ముగింపుకు డాలర్ తో పోల్చితే రూపాయి 3 పైసలు లాభపడి 61.54 వద్ద ట్రేడ్ అవుతోంది.
భారత ఈక్విటీ మార్కెట్ లోకి విదేశీ నిధుల ప్రవాహం జోరందుకోవడం రూపాయి బలపడటానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతానికి చేరుకోవడం, పారిశ్రామిక ఉత్పత్తి 2.5 శాతంతో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం కూడా సానుకూలంగా మారింది.