నెల గరిష్టానికి చేరుకున్న రూపాయి!
నెల గరిష్టానికి చేరుకున్న రూపాయి!
Published Thu, May 8 2014 2:55 PM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
ముంబై: అమెరికన్ కరెన్సీ ఎగుమతిదారులు అమ్మకాలకు పాల్పడటంతో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి ఒకనెల గరిష్టాన్ని నమోదు చేసుకుంది. 60 రూపాయలకు దిగువన ట్రేడ్ కావడం గత నెల రోజుల్లో ఏప్రిల్ 9 తర్వాత ఇదే తొలిసారి.
ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చెంజ్ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 59.94 వద్ద్ర ట్రేడ్ అవుతోంది. బుధవారం రూపాయి 60.13 వద్ద ముగిసింది. గురువారం ఇంట్రా డే ట్రేడింగ్ లో రూపాయి 59.94 గరిష్టాన్ని, 60.05 కనిష్టాన్ని నమోదు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం 1.45 సమయానికి 60.02 వద్ద ట్రేడ్ అవుతోంది.
Advertisement