15 పైసలు నష్టపోయిన రూపాయి
15 పైసలు నష్టపోయిన రూపాయి
Published Mon, Nov 3 2014 10:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM
ముంబై: బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఇంటర్ బ్యాంక్ ఎక్సేంజ్ వద్ద రూపాయి 15 పైసలు నష్టపోయింది. గ్లోబల్ మార్కెట్ లో ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.
శుక్రవారం క్లోజింగ్ లో రూపాయి 9 పైసలు బలపడి 61.36 వద్ద ముగిసింది. సోమవారం ప్రారంభంలో 15 పైసలు క్షీణించి 61.51 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉండగా భారత ఈక్వీటి మార్కెట్ లో సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో ప్రారంభమై.. 27969 పాయింట్ల నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
Advertisement