
గ్రీస్ అత్యవసర రుణానికి ఈయూ ఓకే
బ్రసెల్స్ : సంక్షోభంలో ఉన్న గ్రీస్‌కు అత్యవసరంగా 7.8 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక వ్యవధి రుణం ఇవ్వడానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆమోదముద్ర వేసింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కు కట్టాల్సిన బాకీలను చెల్లించడానికి గ్రీస్‌కు ఈ నిధులు అత్యవసరం. సోమవారం నాటికల్లా ఈసీబీకి 4.2 బిలియన్ డాలర్లు, మిగతాది ఐఎంఎఫ్‌కు గ్రీస్ కట్టాల్సి ఉంది. యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం (ఈఎస్‌ఎం) నుంచి తదుపరి ఆర్థిక సహాయం అందే దాకా గ్రీస్‌ను ఈ నిధులు గట్టెక్కించనున్నాయి.