European Central Bank
-
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ బాదుడు, మామూలుగా లేదుగా!
ఫ్రాంక్ఫర్ట్: మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75శాతం పెంచుతూ 25 మంది సభ్యుల గవర్నింగ్ కౌన్సిల్ గురువారం ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి. ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది. 19 దేశాల యూరోజోన్ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2శాతం లక్ష్యానికి మించి, ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9శాతానికి ఎగసింది. -
రికార్డుల ర్యాలీకి విరామం
ముంబై: జీవితకాల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సూచీల నాలుగురోజుల రికార్డుల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ వెల్లడికి ముందు అమెరికా మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండోరోజూ 11 పైసలు క్షీణించింది. మొహర్రం సందర్భంగా గురువారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను తుదపరి వారానికి రోలోవర్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ ప్రతికూలతలతో సెన్సెక్స్ 163 పాయింట్లు క్షీణించి 55,629 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 16,569 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ నాలుగురోజులు, నిఫ్టీ ఏడురోజుల వరుసగా లాభాల ముగింపునకు అడ్డకట్ట పడినట్లైంది. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, మెటల్ షేర్లు అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు భావించే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. చిన్న, మధ్య తరహా షేర్లు మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అరశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.595 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.729 కోట్ల షేర్లను విక్రయించారు. ఆరంభలాభాలు ఆవిరి..: ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో తొలిసారి 56000 స్థాయిపైన 56,073 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 16,692 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 326 పాయింట్లు ర్యాలీ చేసి 56,118 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు ఎగసి 16,702 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు ఆల్‌టైం హై స్థాయిలను అందుకున్న తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. యూరప్ మార్కెట్ల నష్టాలతో ప్రారంభం కావడం, యూఎస్ ఫ్యూచర్లు నష్టాలతో కదలాడటం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. దీంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాలతో ముగిశాయి. సరికొత్త గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద... స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ.., ఇన్వెస్టర్ల సంపద సరికొత్త గరిష్టానికి చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.242 లక్షల కోట్లకు ఎగసింది. బీఎస్ఈ మార్కెట్ విలువ విషయంలో ఇది ఆల్ టైం హై కావడం విశేషం. చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.5.33 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. నాలుగురోజుల్లో 1,000 పాయింట్లు గతవారాంతన శుక్రవారం(ఆగస్ట్ 13న)సెన్సెక్స్ 55,000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి సరిగ్గా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 1000 పాయింట్ల లాభాల్ని మూటగట్టకుంది. ఈ ఏడాదిలో 1000 పాయింట్లను ఆర్జించేందుకు సెన్సెక్స్ తీసుకున్న అతితక్కువ సమయం ఇదే కావడం విశేషం. ఇదే ఏడాది జనవరి 21న సెన్సెక్స్ 50వేల మార్కును అందుకుంది. ఈ ఏడునెలల్లో 6,000 పాయింట్లు ఆర్జించి 56వేల స్థాయిని తాకింది. ఇదే సమయంలో నిఫ్టీ 2,111 పాయింట్లను ఆర్జించింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చిందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో మూడుశాతానికి పైగా లాభపడి రూ.1,565 స్థాయికి చేరింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యి 0.21 శాతం నష్టంతో రూ.1,511 వద్ద ముగిసింది. ► ఈ వారం ప్రారంభంలో డిస్కౌంట్‌తో లిస్టైయిన విండ్లాస్ షేరు పతనం కొనసాగుతోంది. మూడు శాతం నష్టపోయి రూ.388 వద్ద ముగిసింది. ఇష్యూ ధర రూ.460తో పోలిస్తే మూడురోజుల్లో 16 శాతం నష్టపోయింది. -
యూరప్ ఎలా చేస్తోంది?
500 యూరోల నోటు రద్దు పెద్ద నోట్లు నేర చర్యలకు ఊతమిస్తున్నాయన్న కారణంతోనే (భారత్ మాదిరిగా) యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ) కూడా ఈ ఏడాది మేలో 500 యూరోల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లా కాకుండా, ఆ నోటును క్రమంగా చలామణి నుంచి తొలగించే విధానాన్ని అనుసరించింది. తమ కరెన్సీపై ఉన్న విస్తృత విశ్వాసాన్ని రిస్క్‌లో పెట్టబోమని ఈసీబీ స్పష్టం చేసింది. ఐదు వందల యూరోల బ్యాంకు నోట్ల ముద్రణ, జారీని శాశ్వతంగా నిలిపివేయాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఈ ఏడాది మే నెలలో నిర్ణరుుంచింది. టైజం, నల్లధనం, మనీ లాండరింగ్ డ్రగ్స సరఫరా వంటి నేరాలకు ఈ పెద్ద నోటు ఊతమిస్తోందనే ఆందోళనల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మే 4న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పులా పరిణమించిన నల్లధనాన్ని రూపుమాపడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత 8న ప్రకటించారు. ఏదేమైనా ఒకే సమస్యతో అటు ఈసీబీ, ఇటు భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాయి. అయితే అందుకు అనుసరించిన విధానంలో రెండింటి మధ్య ప్రధానంగా రెండు తేడాలున్నాయి. భిన్న మార్గాలు.. 1. 500 యూరోల నోట్లను ఎప్పటి నుంచి నిలిపివేయనున్నదో, దానికి రెండున్నరేళ్ల ముందుగానే ఈసీబీ ఆ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘2018 చివరి నుంచి 500 యూరోల నోట్లను నిలిపివేయడం జరుగుతుంది. అప్పటికి యూరోపా సిరీస్‌లో 100, 200 యూరోల నోట్లను ప్రవేశపెడతాం. 5-200 మధ్య ఉన్న ఇతర నోట్లు అలాగే కొనసాగుతాయి’ అని ఈసీబీ స్పష్టం చేసింది. దీనికి పూర్తి విరుద్ధంగా, ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచే రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు (కొన్ని మినహారుుంపులు తప్ప) కాకుండా పోయాయి. 2. 500 యూరో నోటు విలువ ఎప్పటికీ అలాగే ఉంటుందని ఈసీబీ ప్రకటించింది. యూరో వ్యవస్థలోని జాతీయ కేంద్ర బ్యాంకుల్లో ఆ నోటును ఎప్పుడైనా మార్చుకోవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యూరో ప్రాధాన్యం దృష్ట్యా ప్రజలు తమ కరెన్సీపై విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ పేర్కొంది. అయితే భారత్‌లో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి డిసెంబర్ 31ని డెడ్‌లైన్‌గా విధించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. ఈసీబీ నిర్ణయం అర్థమేమిటంటే... 2018 చివరి నుంచి యూరోజోన్‌లో ఉన్న 19 దేశాల్లోని కేంద్ర బ్యాంకులు 500 యూరో నోట్లను మార్చుకునేందుకు అనుమతించవన్నమాట. 500 యూరో నోట్లు ఇక చెల్లవంటూ ఈసీబీ ప్రకటించి ఉంటే పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రస్తుతం భారత్‌లో మాదిరిగా జనం బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చేది. అక్కడా విమర్శలు... ప్రస్తుతం భారత్‌లో మాదిరే, ఈసీబీ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మానవహక్కుల ఉల్లంఘన అని, పెద్ద నోట్లను వినియోగించేవారు కేవలం క్రిమినల్స్ మాత్రమే కాదనే విమర్శలు వచ్చాయి. ఈసీబీ 2011లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం... 2008లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘లెహ్మాన్ బ్రదర్స్’ కుప్పకూలిన అనంతరం అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తిన సమయంలో 500 యూరో నోట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు తేలింది. కొంతమంది బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి, నగదు ఉంచుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. ఉగ్రదాడులతో... డ్రగ్స సరఫరా ముఠా ‘యూరో’నే ప్రధాన ంగా వినియోగిస్తున్నట్లు యూఎస్ అధికారులు కొన్నేళ్ల కిందటే గుర్తించారు.(యూఎస్‌లో వంద డాలర్ల నోటే అతిపెద్దది. 1969లో 500,1000, 5000, 10,000 డాలర్ల నోట్లను ఫెడరల్ రిజర్వ్ రద్దు చేసింది. స్విట్జర్లాండ్‌లో 1000 ఫ్రాంక్ నోట్ ఉన్నా, చెలామణిలో ఉన్నది తక్కువ.) ఓవైపు 500 యూరో నోట్ల అవసరంపై చర్చ జరుగుతుండగా, గతేడాది నవంబర్‌లో పారిస్‌లో, ఈ ఏడాది మార్చిలో బ్రస్సెల్స్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఈ నోట్లను రద్దు చేయాలన్న డిమాండ్ జోరందుకుంది. అసాంఘిక చర్యలకు ఈ నోట్లను వినియోగిస్తుండడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయాన్ని ఎంతో కాలం విస్మరించలేమని ఈసీబీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఒకరు పారిస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మనీలాండ్‌రింగ్, ఉగ్రమూకలకు అందుతున్న నిధుల్లో 500 యూరో నోట్లదే అగ్రభాగమని ఈసీబీ అధికారులు గుర్తించారు. ఆఫ్‌షోర్ బ్యాంకులు, షెల్ కంపెనీలు, సెంట్రల్ బ్యాంకుల పరిధిలో లేని బిట్కారుున్ వంటి డిజిటల్ కరెన్సీల ద్వారా కూడా అక్రమ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ నేర సామ్రాజ్యంలో నగదు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆధారం: న్యూయార్క్ టైమ్స్, ఈఎన్ఎస్ -
మూడు రోజుల లాభాలకు బ్రేక్
114 పాయింట్ల నష్టంతో 28,221కు సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో 8,744 వద్ద ముగింపు యూరోప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీని ఉపసంహరించనున్నదన్న వార్తలకు లాభాల స్వీకరణ జతకావడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 28,221 పాయింట్ల వద్ద,ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 8,744 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, వాహన, ఐటీ, టెక్నాలజీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,800 పాయింట్లు దాటినా.. అమ్మకాల ఒత్తిడితో నిలదొక్కుకోలేకపోయింది. ఆరంభంలో లాభాలు..: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అంచనాలతో ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్‌కు లాభాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది చివరినాటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయని ఊహాగానాలు, బ్రెగ్జిట్ ప్రభావం తీవ్రం కానున్నదనే అంచనాలు, ఆగస్టులో 54.7గా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 52కు తగ్గడం ... ప్రతికూల ప్రభావం చూపాయి. ప్యాకేజీని ఈసీబీ ఉపసంహరించే అవకాశాలున్నాయన్న ఊహాగానంతో అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్ పెరిగాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. దీంతో యూరోప్ మార్కెట్లు నష్టాల పాలుకాగా, దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు. లాభాల్లో లోహ, టైర్ల షేర్లు చౌక ఎగుమతుల నుంచి దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించడానికి 66 ఉక్కు ఉత్పత్తులపై కనీస దిగుమతి ధరను మరో రెండు నెలల పాటు ప్రభుత్వం పొడిగించడంతో ఉక్కు కంపెనీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1% వరకూ పెరిగాయి. సహజ రబ్బరు ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోవడంతో టైర్ల కంపెనీల షేర్లు పెరిగాయి. ఎంఆర్ఎఫ్, సియట్, గుడ్ ఇయర్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేర్లు 1-8% రేంజ్లో పెరిగాయి. -
బ్రిటన్ ఎగ్జిట్ అవుతుందా?
(సాక్షి, బిజినెస్ విభాగం) యూరోపియన్ యూనియన్‌లో (ఈయూ) ‘బ్రిటన్’ ఉండాలా... వద్దా?(బ్రెగ్జిట్).. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసే ఈ ప్రశ్నకు జవాబు మరో 24 గంటల్లో తేలనుంది. ఈ అంశంపై బ్రిటన్‌లో గురువారం ఉదయం(భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30కు) రెఫరెండానికి పోలింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకవేళ బ్రెగ్జిట్‌కే బ్రిటన్లు మొగ్గుచూపితే.. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. యూరప్‌లో వ్యాపారం ఎక్కువగా ఉన్న విదేశీ కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకుంటోంది? వివరాలు.. కాందీశీకులతోనే సమస్య.. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అమెరికా, రష్యాలు చెరోపక్క మోహరించాయి. ఈ పరిస్థితుల్లో వాణిజ్య ప్రయోజనాల కోసం 28 యూరప్ దేశాలు క సమూహంగా ఏర్పడటంతో ఈయూ పురుడు పోసుకుంది. అయితే.. ఈయూ ఒప్పందాల ప్రకారం ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లొచ్చు. కొంతకాలంగా అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న సిరియా, ఇరాక్ వంటి కల్లోల దేశాల నుంచి బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలకు లక్షల మంది తరలివస్తున్నారు. ఇలా వస్తున్న వారికి సామాజిక భద్రత కల్పించటం కత్తిమీద సామే. అయితే దీనివల్ల తమ ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం, తాము కడుతున్న పన్నును కాందిశీకులకు ధారపోస్తున్నారన్న అసంతృప్తి బ్రిటన్లలో ఉంది. బ్రిటన్ వైదొలిగితే ఏమవుతుంది? ఈయూ నుంచి వైదొలిగితే బ్రిటన్ ఆర్థికంగా దెబ్బతింటుందనేది విశ్లేషకుల భావన. ఈయూ బహిరంగ మార్కెట్లకు చేరే అవకాశం కోల్పోవడంతో బ్రిటన్ కొంత వాణిజ్యాన్ని, పెట్టుబడుల్ని నష్టపోతుందని అంచనా. అయితే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున సొంతగా మరింత వృద్ధి సాధిస్తామన్నది బ్రెగ్జిట్ సమర్థకుల వాదన. యూరో సమస్య.. ఈయూలోని 19 దేశాకు యూరో ఉమ్మడి కరెన్సీ. బ్రిటన్‌లో మాత్రం పౌండ్ స్టెర్లింగే కరెన్సీ. కొన్నేళ్లుగా యూరో బలహీనపడింది (డాలరుతో పోలిస్తే). దీంతో ఎగుమతులు జరిపే జర్మనీ వంటి దేశాలు లబ్దిపొందగా, దిగుమతులపై ఆధారపడే గ్రీస్ వంటివి దెబ్బతిన్నాయి. ఆ ఈయూ, యూరో అంటే మండిపడుతున్నా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి భారీ రుణాలు తీసుకున్నందున రెఫరెండం జోలికి వెళ్లటం లేదు. -
యూరో జోన్ కు ఈసీబీ పాలసీ బూస్ట్...
ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు ఇక ‘జీరో’ డిపాజిట్ రేటు మైనస్ 0.3% నుంచి మైనస్ 0.4%కి తగ్గింపు ఫ్రాంక్ఫర్ట్: యూరోజోన్ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపించడానికి వీలుగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వడ్డీ రేట్లనూ తగ్గించింది. తాను బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును (రిఫీ రేటు- రీఫైనాన్షింగ్ రేటు) ప్రస్తుత 0.05 శాతం నుంచి జీరో స్థాయికి తగ్గించింది. ఇక బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటు (డిపాజిట్)ను కూడా మైనస్ - 0.3 శాతం నుంచి మైనస్ -0.4 శాతానికి తగ్గించింది. అంటే బ్యాంకులు తమ అదనపు నిధులను ఈసీబీ వద్ద ఉంచాలంటే... మరింత వడ్డీ చెల్లించాలన్నమాట. దీనివల్ల బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఈసీబీలో డిపాజిట్ చేసుకోడానికి బదులు, వృద్ధికి ఊతంగా వ్యవస్థలోకి మళ్లించే అవకాశం ఉంది. అదే సమయంలో జీరో శాతానికే వాటికి ఈసీబీ నుంచి రుణ సౌలభ్యం కూడా అందుబాటులో ఉంటుంది. వ్యవస్థలో రుణ లభ్యత, డిమాండ్ గణనీయంగా మెరుగుపడ్డానికి ఈ చర్య దోహదపడే అవకాశం ఉంది. బాండ్ల కొనుగోలు పరిమితి పెంపు... దీనితోపాటు వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) మెరుగునకు ఈసీబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు 60 బిలియన్ యూరోల విలువైన బాండ్ల కొనుగోలు విలువను ఏప్రిల్ నుంచీ 80 బిలియన్ యూరోలకు పెంచుతున్నట్లు సైతం ప్రకటించింది. అనంతరం ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాగీ మీడియాతో మాటాడుతూ ఈసీబీ చొరవలు యూరోజోన్ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈసీబీ తాజా నిర్ణయం తక్షణం అమెరికా డాలర్‌తో పోలిస్తే యూరో ఒక శాతం పతనానికి దారితీసింది. -
రెండు నెలల గరిష్టస్థాయికి మార్కెట్
- ఇసీబీ ప్యాకేజీ ప్రభావం - సెన్సెక్స్ 183 పాయింట్లు అప్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసీబీ) త్వరలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే సంకేతాలనివ్వడంతో శుక్రవారం ప్రపంచ మార్కెట్లన్నీ ర్యాలీ జరిపాయి. ఇదే క్రమంలో భారత్ మార్కెట్ రెండు నెలల గరిష్టస్థాయి వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 183 పాయింట్ల పెరుగుదలతో 27,471 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 44 పాయింట్ల వృద్ధితో 8,295 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ సైతం 64,82 స్థాయికి పుంజుకోవడంతో సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చడానికి మరిన్ని రేట్ల తగ్గింపులు వుంటాయంటూ ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాఘి గురువారం సాయంత్రం సంకేతాలిచ్చారు. దాంతో అమెరికా మార్కెట్ పెద్ద ఎత్తున ర్యాలీ జరిపింది. ఈ ప్రభావంతో శుక్రవారం మన మార్కెట్ కూడా ఎగసింది. స్టాక్ సూచీ లు వరుసగా నాల్గవ వారం లాభాల్లో ముగిశాయి. ఐటీసీ అప్: ఇంకా క్యూ2 ఫలితాల్ని ప్రకటించాల్సివున్న ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు 2.81 శాతం పెరిగి ఆరు నెలల గరిష్టస్థాయి రూ. 358 వద్ద ముగిసింది. రెండు ప్రధాన సూచీల్లోనూ అధిక వెయిటేజీ కలిగినందున, ఈ షేరు పెరుగుదలతో సూచీలు కూడా పైస్థాయిలో ముగియగలిగాయి. -
కొనుగోళ్ల జోరుతో లాభాలు
పడిన షేర్లకు డిమాండ్... - సానుకూల అంతర్జాతీయ సంకేతాలు - 311 పాయింట్ల లాభంతో 25,765కు సెన్సెక్స్ - 106 పాయింట్ల లాభపడి 7,823కు నిఫ్టీ ఇటీవలి పతనం కారణంగా బాగా పడిపోయన షేర్లలో కొనుగోళ్లకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు కళ్లెం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో 25,765 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 7,823 పాయింట్ల వద్ద ముగిశాయి. యూరోప్ కేంద్ర బ్యాంక్ సమావేశం నేపథ్యంలో యూరోప్ మార్కెట్లు ర్యాలీ జరపడం, ఆగస్టు నెలలో సేవల రంగంలో వృద్ధి(జూలైలో 50.8గా ఉన్న నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టులో 51.8కు పెరగడం) కూడా ప్రభావం చూపాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. షార్ట్‌కవరింగ్: గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో బాగా పతనమైన బ్యాంక్, ఆర్థిక సేవల, క్యాపిటల్ గూడ్స్, వాహన, లోహ షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం విదేశీ ఇన్వెస్టర్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)కు సంబంధించి తదుపరి చర్యలు నిలిపేయాల్సిందని ఫీల్డ్ ఆఫీసర్లకు సీబీడీటీ ఆదేశాలివ్వడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయని నిపుణులంటున్నారు. బుధవారం ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం, సుదీర్ఘకాల సెలవుల కారణంగా చైనా మార్కెట్ పనిచేయకపోవడంతో ప్రపంచ మార్కెట్లలో ప్రశాంతత నెలకొనడం, వృద్ధి అవకాశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి వెలువరించిన తాజా నివేదిక వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. అంచనాలను అందుకోలేని జీడీపీ, తయారీ రంగ గణాంకాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లోనే ఉండడం వంటి కారణాల వల్ల ఆర్బీఐ ఈ నెల 29న జరిగే తన పరపతి సమీక్షలో కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయని నిపుణులంటున్నారు. రియల్టీ జోరు: గత రెండు నెలల్లో క్షీణిస్తూ వచ్చిన రియల్టీ షేర్లు 8 శాతం వరకూ పెరిగాయి. డీఎల్ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, డీబీ రియల్టీ, ఒబెరాయ్ రియల్టీ5-8 శాతం రేంజ్లో, యూనిటెక్, గోద్రేజ్ ప్రోపర్టీస్, శోభ, డెల్టా కార్ప్, ఆషియానా, ఎన్బీసీసీ షేర్లు 1-4 శాతం రేంజ్లో పెరిగాయి. -
గ్రీస్ అత్యవసర రుణానికి ఈయూ ఓకే
బ్రసెల్స్ : సంక్షోభంలో ఉన్న గ్రీస్‌కు అత్యవసరంగా 7.8 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక వ్యవధి రుణం ఇవ్వడానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆమోదముద్ర వేసింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కు కట్టాల్సిన బాకీలను చెల్లించడానికి గ్రీస్‌కు ఈ నిధులు అత్యవసరం. సోమవారం నాటికల్లా ఈసీబీకి 4.2 బిలియన్ డాలర్లు, మిగతాది ఐఎంఎఫ్‌కు గ్రీస్ కట్టాల్సి ఉంది. యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం (ఈఎస్ఎం) నుంచి తదుపరి ఆర్థిక సహాయం అందే దాకా గ్రీస్‌ను ఈ నిధులు గట్టెక్కించనున్నాయి. -
3 వారాల కనిష్టస్థాయికి బంగారం ధర
ముంబై: పుత్తడికి పెట్టుబడుల డిమాండ్ లేకపోవడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు వరుసగా మూడు వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారు కొనుగోళ్లు క్షీణించాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్ల ఉంటే బంగారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బంగారు డిమాండ్ పెరుగుతుంది. మే 29తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే దేశీయంగా 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ. 105 తగ్గి రూ.27,225 కు చేరింది. వెండి ధర కిలోకి రూ.175 తగ్గి రూ.38,400 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 శాతం క్షీణించి ఔన్సుకు 1189 డాలర్ల వద్ద క్లోజయ్యింది. -
ఈ వారంలో...బంగారం పెరగొచ్చు!
అమెరికా డాలరు పటిష్టంగా వున్నప్పటికీ, ఈ వారం బంగారం ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రసిద్ధ కమోడిటీ వెబ్సైట్ కిట్కో న్యూస్ సర్వేలో పాల్గొన్న 20 మంది నిపుణుల్లో 13 మంది ఈ వారం పుత్తడి ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. జూన్ 3న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయం, 4న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల నిర్ణయం, 5న అమెరికా ఉద్యోగ గణాంకాలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తాయని వారు అంటున్నారు. అలాగే పుత్తడి కొనుగోళ్ల నుంచి షేర్మార్కెట్వైపు మళ్లిన చైనా పరిణామాలను బులియన్ ట్రేడర్లు గమనిస్తున్నారు. గతవారం ఒకేరోజున చైనా మార్కెట్ 6.5 శాతం పతనమైనందున, బంగారం పెట్టుబడులకు చైనా ఇన్వెస్టర్లు తిరిగి వస్తారా లేక ఈక్విటీల్లోనే వారు పెట్టుబడుల్ని కొనసాగిస్తారా అనే అంశం ప్రపంచ బులియన్ మార్కెట్లో నలుగుతోంది. మరోవైపు కిట్కో ఆన్లైన్ సర్వే నిర్వహించగా 45 శాతంమంది ఈ వారం బంగారం ధరలు అధికంగా వుంటాయని పేర్కొన్నారు. 35 శాతం మంది తగ్గుతాయని, 20 శాతంమంది మార్పేమీ వుండదని పేర్కొన్నారు. వరుసగా రెండోవారం తగ్గిన పుత్తడి.. పుత్తడికి పెట్టుబడుల డిమాండ్ లేకపోవడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారంలోనూ తగ్గాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారు కొనుగోళ్లు క్షీణించాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్ల ఉంటే బంగారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బంగారు డిమాండ్ పెరుగుతుంది. మే 29తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే దేశీయంగా బంగారం ధర 10 గ్రాములకు (99.5 ప్యూరిటి) రూ.205 తగ్గి రూ.26,900కు చేరింది. 99.9 ప్యూరిటి పుత్తడి రూ.205 తగ్గి రూ.27,050గా ఉంది. వెండి ధర కిలోకి రూ.550 తగ్గి రూ.38,765గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 శాతం క్షీణించి ఔన్సుకు 1189 డాలర్ల వద్ద క్లోజయ్యింది. -
యూరోజోన్‌కు ఉద్దీపన ఆక్సిజన్!
ఈసీబీ 1.1 ట్రిలియన్ యూరోల సహాయ ప్యాకేజీ ఫ్రాంక్ఫర్ట్: యూరోజోన్ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఆర్థిక సహాయక చర్యలను గురువారం ప్రకటించింది. ఈ ఉద్దీపన విలువ దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్లు. 2015 మార్చి నుంచి 2016 సెప్టెంబర్ వరకూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం జరుగుతుందని ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాఘీ ప్రకటించారు. ఈ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం వల్ల మొత్తం యూరోజోన్ ఎకానమీలో కొత్త ఊపును తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సంబంధించి నెలకు 60 బిలియన్ యూరోల సెక్యూరిటీలను (బాండ్ల)ను ఈసీబీ కొనుగోలు చేయనున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ తెలిపారు. అంటే వ్యవస్థలోకి నెలకు 60 బిలియన్ డాలర్ల యూరోలు వస్తాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, డిమాండ్ పెంపు, మందగమనంలో నడుస్తున్న యూరో ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా ఉత్సాహాన్ని అందించడం తాజా ఉద్దీపన నిధుల లక్ష్యమని అన్నారు. ఈ నిర్ణయం వల్ల కొన్ని దేశాల్లో వ్యయాలు పెరిగి, ఆర్థిక సంస్కరణలు నీరుగారతాయని జర్మనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, మొత్తం యూరో వృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. గ్యాపప్‌తో భారత సూచీలు! యూరప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీ.. అంచనాలను మించడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్టీఎస్ఈ, డ్యాక్స్, సీఏసీ-40లు 11.5% మేర పెరిగాయి. ఇదే జోరును అమెరికా మార్కెట్లు కొనసాగించాయి. గురువారం రాత్రి ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,847 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) భారత స్టాక్ మార్కెట్లు గ్యాప్ అప్‌తో మొదలవుతాయనేది విశ్లేషకుల అంచనా. -
ఆర్బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంకుల స్థాయిల్లో వివిధ ఆర్థిక, సాంకేతిక, విజ్ఞానపరమైన అంశాలకు సంబంధించి మరింత సహకారం, సమన్వయం ఈ అవగాహన లక్ష్యం. అవగాహనా పత్రంపై సోమవారం ఆర్బీఐ చీఫ్ రఘురామ్ రాజన్, ఈసీబీ ప్రెసిడెంట్ మారియో సంతకాలు చేశారు. -
రూపాయి క్షీణతకు అడ్డుకట్టకు చర్యలు!
న్యూఢిల్లీ: అడ్డూఅదుపూలేకుండా జారిపోతున్న రూపాయికి మద్దతుగా ప్రభుత్వం నేడు(సోమవారం) మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి చిదంబరం ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావుతో విస్తృత చర్చలు జరిపారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారామ్ కూడా సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రూపాయి స్థిరీకరణకు కీలక చర్యలు వెలువడతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా విదేశీ నిధులను మరింత ఆకర్షించడమే ఈ చర్యల ప్రధానోద్దేశం. కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ(ఈసీబీ) నిబంధనలను సడలించడం, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులపై సుంకం పెంపు, ఎగుమతులకు ప్రోత్సాహం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. గత వారంలో డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.80) తాకిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 15 శాతం పైగానే క్షీణించింది.దేశీ కరెన్సీ చికిత్సకు ఆర్బీఐ ఇప్పటికే ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) కట్టడి, స్పెక్యులేషన్‌ను తగ్గించేవిధంగా చర్యలు తీసుకున్నప్పటికీ... రూపాయి పతనం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రతి సోమవారం రూ.22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్ల వేలం చేపట్టనున్నట్లు కూడా ఆర్బీఐ తాజాగా ప్రకటించడం గమనార్హం. కాగా, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు సార్వభౌమ బాండ్ల తరహా(క్వాసీ-సావరీన్) రుణపత్రాల జారీ ద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు కూడా కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయని సమాచారం. క్యాడ్ కట్టడే లక్ష్యం...: కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం)ను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీతో పోలిస్తే 4.8%) ఎగబాకడం తెలిసిందే. క్యాడ్‌కు అడ్డుకట్టవేయడానికి వీలుగా నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని మంత్రుల కమిటీ ఇప్పటికే ఆర్థిక మంత్రికి సిఫార్సుల నివేదికను సమర్పించింది. కేంద్రం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. బొగ్గు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ దిగుమతులపై దృష్టిపెట్టినట్లు చిదంబరం ఇదివరకే చెప్పారు.