యూరప్ ఎలా చేస్తోంది? | How the europe are seeing? | Sakshi
Sakshi News home page

యూరప్ ఎలా చేస్తోంది?

Published Wed, Dec 7 2016 4:29 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

యూరప్ ఎలా చేస్తోంది? - Sakshi

యూరప్ ఎలా చేస్తోంది?

500 యూరోల నోటు రద్దు
 
 పెద్ద నోట్లు నేర చర్యలకు ఊతమిస్తున్నాయన్న కారణంతోనే (భారత్ మాదిరిగా) యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ) కూడా ఈ ఏడాది మేలో 500 యూరోల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

 అయితే భారత్‌లా కాకుండా, ఆ నోటును క్రమంగా చలామణి నుంచి తొలగించే విధానాన్ని అనుసరించింది. తమ కరెన్సీపై ఉన్న విస్తృత విశ్వాసాన్ని రిస్క్‌లో పెట్టబోమని ఈసీబీ స్పష్టం చేసింది.
 
 ఐదు వందల యూరోల బ్యాంకు నోట్ల ముద్రణ, జారీని శాశ్వతంగా నిలిపివేయాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఈ ఏడాది మే నెలలో నిర్ణరుుంచింది. టైజం, నల్లధనం, మనీ లాండరింగ్  డ్రగ్‌‌స సరఫరా వంటి నేరాలకు ఈ పెద్ద నోటు ఊతమిస్తోందనే ఆందోళనల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మే 4న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
 
 దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పులా పరిణమించిన నల్లధనాన్ని రూపుమాపడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత 8న ప్రకటించారు. ఏదేమైనా ఒకే సమస్యతో అటు ఈసీబీ, ఇటు భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాయి. అయితే అందుకు అనుసరించిన విధానంలో రెండింటి మధ్య ప్రధానంగా రెండు తేడాలున్నాయి.

 భిన్న మార్గాలు..
 1. 500 యూరోల నోట్లను ఎప్పటి నుంచి నిలిపివేయనున్నదో, దానికి రెండున్నరేళ్ల ముందుగానే ఈసీబీ ఆ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘2018 చివరి నుంచి 500 యూరోల నోట్లను నిలిపివేయడం జరుగుతుంది. అప్పటికి యూరోపా సిరీస్‌లో 100, 200 యూరోల నోట్లను ప్రవేశపెడతాం. 5-200 మధ్య ఉన్న ఇతర నోట్లు అలాగే కొనసాగుతాయి’ అని ఈసీబీ స్పష్టం చేసింది. దీనికి పూర్తి విరుద్ధంగా, ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచే రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు (కొన్ని మినహారుుంపులు తప్ప) కాకుండా పోయాయి.

 2. 500 యూరో నోటు విలువ ఎప్పటికీ అలాగే ఉంటుందని ఈసీబీ ప్రకటించింది. యూరో వ్యవస్థలోని జాతీయ కేంద్ర బ్యాంకుల్లో ఆ నోటును ఎప్పుడైనా మార్చుకోవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యూరో ప్రాధాన్యం దృష్ట్యా ప్రజలు తమ కరెన్సీపై విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ పేర్కొంది. అయితే భారత్‌లో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి డిసెంబర్ 31ని డెడ్‌లైన్‌గా విధించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి.

 ఈసీబీ నిర్ణయం అర్థమేమిటంటే... 2018 చివరి నుంచి యూరోజోన్‌లో ఉన్న 19 దేశాల్లోని కేంద్ర బ్యాంకులు 500 యూరో నోట్లను మార్చుకునేందుకు అనుమతించవన్నమాట. 500 యూరో నోట్లు ఇక చెల్లవంటూ ఈసీబీ ప్రకటించి ఉంటే పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రస్తుతం భారత్‌లో మాదిరిగా జనం బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చేది.

 అక్కడా విమర్శలు...
 ప్రస్తుతం భారత్‌లో మాదిరే, ఈసీబీ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మానవహక్కుల ఉల్లంఘన అని, పెద్ద నోట్లను వినియోగించేవారు కేవలం క్రిమినల్స్ మాత్రమే కాదనే విమర్శలు వచ్చాయి. ఈసీబీ 2011లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం... 2008లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ‘లెహ్‌మాన్ బ్రదర్స్’ కుప్పకూలిన అనంతరం అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తిన సమయంలో 500 యూరో నోట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు తేలింది. కొంతమంది బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి, నగదు ఉంచుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు.

 ఉగ్రదాడులతో...
 డ్రగ్‌‌స సరఫరా ముఠా ‘యూరో’నే ప్రధాన ంగా వినియోగిస్తున్నట్లు యూఎస్ అధికారులు కొన్నేళ్ల కిందటే గుర్తించారు.(యూఎస్‌లో వంద డాలర్ల నోటే అతిపెద్దది. 1969లో 500,1000, 5000, 10,000 డాలర్ల నోట్లను ఫెడరల్ రిజర్వ్ రద్దు చేసింది. స్విట్జర్లాండ్‌లో 1000 ఫ్రాంక్ నోట్ ఉన్నా, చెలామణిలో ఉన్నది తక్కువ.)  ఓవైపు 500 యూరో నోట్ల అవసరంపై చర్చ జరుగుతుండగా, గతేడాది నవంబర్‌లో పారిస్‌లో, ఈ ఏడాది మార్చిలో బ్రస్సెల్స్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఈ నోట్లను రద్దు చేయాలన్న డిమాండ్ జోరందుకుంది.

అసాంఘిక చర్యలకు ఈ నోట్లను వినియోగిస్తుండడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయాన్ని ఎంతో కాలం విస్మరించలేమని ఈసీబీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఒకరు పారిస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మనీలాండ్‌రింగ్, ఉగ్రమూకలకు అందుతున్న నిధుల్లో 500 యూరో నోట్లదే అగ్రభాగమని ఈసీబీ అధికారులు గుర్తించారు. ఆఫ్‌షోర్ బ్యాంకులు, షెల్ కంపెనీలు, సెంట్రల్ బ్యాంకుల పరిధిలో లేని బిట్‌కారుున్ వంటి డిజిటల్ కరెన్సీల ద్వారా కూడా అక్రమ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ నేర సామ్రాజ్యంలో నగదు కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
 ఆధారం: న్యూయార్క్ టైమ్స్, ఈఎన్‌ఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement