3 వారాల కనిష్టస్థాయికి బంగారం ధర
ముంబై: పుత్తడికి పెట్టుబడుల డిమాండ్ లేకపోవడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు వరుసగా మూడు వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారు కొనుగోళ్లు క్షీణించాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్ల ఉంటే బంగారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బంగారు డిమాండ్ పెరుగుతుంది.
మే 29తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే దేశీయంగా 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ. 105 తగ్గి రూ.27,225 కు చేరింది. వెండి ధర కిలోకి రూ.175 తగ్గి రూ.38,400 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 శాతం క్షీణించి ఔన్సుకు 1189 డాలర్ల వద్ద క్లోజయ్యింది.