industrial activity
-
జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండ్రస్టియల్ కారిడార్‌లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్‌లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్‌నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: వికసిత్ భారత్ దృష్టితో ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దేశంలోని 10 రాష్ట్రాల్లో ఆరు ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో రూ.28,602 కోట్ల వ్యయంతో 12 ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో రూ.2,786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో, రూ.2,137 కోట్లతో కొప్పర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇదేకాకుండా ఏపీలో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండూ కర్నూలు జిల్లాలోనే.. కర్నూలు జిల్లాలో కొప్పర్తి ఇండ్రస్టియల్ స్మార్ట్‌సిటీ కర్నూలు ఎయిర్‌పోర్టుకు 11 కిలోమీటర్ల దూరంలో 2,596 ఎకరాల్లో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.2,137 కోట్లు కాగా, రూ.8,860 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఈ ప్రాజెక్టు ద్వారా పునరుత్పాదక రంగం, ఆటోమొబైల్ పరికరాలు, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల రంగాల్లో 54,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. కాగా.. కర్నూలు ఎయిర్‌పోర్టుకు 12 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ 2,621 ఎకరాల్లో నిర్మాణం కానుంది. నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్ పరికరాలు, పునరుత్పాదక రంగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏరో స్పేస్, డిఫెన్స్ హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ జ్యువెలరీ, వస్త్ర రంగాల ద్వారా 45,071 మందికి ఉపాధి కల్పించనున్న ఈ ప్రాజెక్ట్‌లో రూ.12 వేల కోట్ల పెట్టుబడికి అవకాశాలున్నాయి.కొత్త ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటు ఇలా..దేశంలోని మొత్తం 234 నగరాల్లో 730 ప్రైవేట్ ఎఫ్ఎం కేంద్రాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, మచిలీపట్నం, మదనపల్లి, నంద్యాల, నరసరావుపేట, ఒంగోలు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, విజయనగరం పట్టణాల్లో మూడేసి చొప్పున, కాకినాడ, కర్నూలు పట్టణాల్లో నాలుగు చొప్పున ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
తగ్గిన పరిశ్రమల జోరు.. ఆహార ధరల తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 25 శాతంపైగా వెయిటేజ్ ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2023 డిసెంబర్లో మందగించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెలలో ఈ రంగం వృద్ధి స్పీడ్ 5.1 శాతం. సమీక్షా కాలంలో మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి విభాగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. అయితే 2023 నవంబర్‌తో (2.4 శాతం) డిసెంబర్లో సూచీ పెరగడం (3.8 శాతానికి) కొంత ఊరటనిచ్చే అంశం. ఇక జనవరి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. కీలక రంగాలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు 3.6 శాతం (2022 డిసెంబర్) నుంచి 3.9 శాతానికి (2023 డిసెంబర్) పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 10.4 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. మైనింగ్ క్షీణతలోనే ఉంది. అయితే క్షీణ రేటు 10.1 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. తొమ్మిది నెలల కాలంలో అప్ ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల (ఏప్రిల్–డిసెంబర్) కాలాన్ని చూస్తే.. మాత్రం ఐఐపీ వృద్ధి రేటు 5.5% నుంచి 6.1%కి పెరిగింది. ఆహార ధరల తగ్గుముఖం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, డిసెంబర్లో ధరల భారం 9.53 శాతం పెరగ్గా, ఈ భారం జనవరిలో 8.3 శాతానికి తగ్గింది. ఆహారం, పానీయాల విభాగంలో 7.58%, హౌసింగ్ రంగంలో 3.20% ద్రవ్యోల్బణం నమోదైంది. -
వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరత్రా అంశాలపై వారు చర్చించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సజ్జన్ జిందాల్ వివరించారు. జనవరి నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో ఈ ప్లాంటు కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వచ్చేనెలలో దీని శంకుస్థాపకు సన్నద్ధమవుతున్నామన్నారు. సౌరవిద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ సీఎంకు వివరించారు. -
ఐఐటీఎఫ్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్
ఢిల్లీ: పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి అనుకూల వాతావరణం ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన(ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్)లో ఏపీ పెవిలియన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, తయారయ్యే వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.పెవిలియన్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , జగనన్న కాలనీల నమూనాల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఏపీలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 45వేల ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందని తెలిపారు. ఏపీలో పరిశ్రమల గ్రోత్ రేటు 11.43తో అందరి కంటే ముందుందని వెల్లడించారు. ఎగుమతులలో ఏపీ ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: దయాకర్ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ -
వర్ధమాన దేశాలకు ‘అభివృద్ధి లక్ష్యాల’ నిధులు కావాలి
న్యూఢిల్లీ: సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యాల సాధన కోసం వర్ధమాన దేశాలకు దీర్ఘకాలికంగా నిధులు అవసరమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం కోపెన్హాగన్ ఒప్పందం ప్రకారం సంపన్న దేశాల నుంచి వర్ధమాన దేశాలకు నిధుల ప్రవాహం పెరగాలని పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో కూటమిని మరింత సమ్మిళితంగా ఎలా చేయవచ్చు, ప్రపంచ ఎకానమీ వృద్ధికి ఎలా దోహదపడవచ్చు అనే అంశాలకు భారత్ ప్రాధాన్యత నిస్తోందని కాంత్ తెలిపారు. ఇదీ చదవండి: ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్ అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులు, డేటా ఎకానమీ తదితర విషయాల్లో భారత్ వేగంగా పురోగమి స్తోందని.. ఇతర దేశాలకూ ఈ మోడల్ ఉపయోగకరమైనదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ వేడిమిని తగ్గించే లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు చర్యలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కాంత్ చెప్పారు. పారిశ్రామికీకరణ క్రమంలో పాశ్చాత్య దేశాలే వాతావరణాన్ని భారీగా కలుషితం చేశాయని, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో వర్ధమాన దేశాల వాటా చాలా స్వల్పమేనని ఆయన తెలిపారు. కర్బన ఉద్గారాలతో ప్రపంచాన్ని ముంచెత్తకుండా పారిశ్రామిక బాటలో ముందుకు సాగే తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటుందని కాంత్ చెప్పారు. (Dr.Vandana Lal Success Story: రూ. 3వేల కోట్ల నికర విలువతో రిచెస్ట్ విమెన్: ఆసక్తికర విషయాలు) మరిన్ని వార్తలు, అప్డేట్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఎంఎస్ఎంఈలకు చేయూత ఇవ్వాలి: సీఎం జగన్
-
వాటిపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: ఎస్ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ సీఎం జగన్ మాట్లాడుతూ, పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 2024 మార్చి కల్లా రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కావాలన్నారు. 2023 డిసెంబర్ కల్లా పనులన్నీ పూర్తికావాలన్నారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. 2023 జూన్ కల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. -
పారిశ్రామిక రంగం ఇక పరుగులే.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులు, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి కలిపి రికార్డు స్థాయిలో రూ.5,081.41 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.4,779.1 కోట్లతో పోలిస్తే ఇది 6.32 శాతం అదనం. ఇందులో ఒక్క పారిశ్రామిక మౌలిక వసతులకే రూ.1,142.53 కోట్లు వ్యయం చేయనున్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, రెండు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ మారిటైం బోర్డు రూ.8,000 కోట్లు రుణం తీసుకోవడానికి కూడా అనుమతించారు. ఇందులో ఇప్పటికే రామాయపట్నం, భావనపాడు పోర్టు పనులకు టెండర్లు ఖరారు కాగా.. బందరు పోర్టుకు తాజాగా టెండర్లు పిలిచారు. అదే విధంగా విశాఖ వద్ద భోగాపురం, నెల్లూరు దగదర్తి వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించడానికి ఏకంగా రూ.969.91 కోట్లు వ్యయం చేయనున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, ఐటీ రంగానికి రూ. 212.13 కోట్లు కేటాయించారు. ఎంఎస్ఎంఈలకు రూ.450 కోట్లు అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఈ బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్ జగనన్న, వైఎస్సార్ బడుగు వికాసం కింద రాయితీలకు రూ.175 కోట్లు కేటాయించారు. ఐటీ రంగ కంపెనీల ప్రోత్సాహకాలకు రూ.60 కోట్లు, ఇతర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.411.62 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఏడీబీ నిధులతో అభివృద్ధి చేస్తున్న విశాఖ–చెన్నై కారిడార్‌లో వివిధ పనులకు రూ.611.86 కోట్లు కేటాయించారు. ఈ కారిడార్‌లో రహదారుల అభివృద్ధికి రూ.250 కోట్లు, ఏపీఐఐసీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.236.86 కోట్లు, విద్యుత్ సదుపాయాల కోసం రూ.125 కోట్లు వ్యయం చేయనున్నారు. ఎగుమతుల్లో ఏడు నుంచి నాలుగో స్థానానికి.. మరోవైపు.. 2019–20లో దేశ ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21 నాటికి 4వ ర్యాంకుకు చేరుకుందని, 16.8 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద రూ.7,976 కోట్ల విలువైన ఎంఎస్ఎంఈ ఖాతాలను పునర్వ్యవస్థీకరణ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఏడాదిలో వెనుకబడిన, షెడ్యూల్ తరగతులకు చెందిన పరిశ్రమలకు రూ.671 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభం ఐటీ, ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీని సీఎం జగన్ గత ఏడాది డిసెంబర్ 23న ప్రారంభించారని బుగ్గన చెప్పారు. ఇప్పటికే ఇక్కడ రూ.660 కోట్లతో 9,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఈ రంగంలో వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీలు రానున్నాయన్నారు. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో ఇలా భారీ కేటాయింపులు చేయడంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 7,107 ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా రూ.2,099 కోట్ల పెట్టుబడులతో పాటు 46,811 మందికి ఉపాధి లభించిందన్నారు. అలాగే, జనవరి 31, 2022 నాటికి 11 మెగా ప్రాజెక్టులు ఏర్పాటుకావడం ద్వారా 3,989 మందికి ఉపాధి లభించినట్లు తెలిపారు. మరో 55 భారీ ప్రాజెక్టులు రూ.44,097 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. వీటిద్వారా 93,116 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్థిక వృద్ధికి దోహదం చేసే బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా పలు అభివృద్ధి పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్ర వృద్ధిలో కీలకమైన ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు, కర్నూలులో ఎయిర్‌పోర్టు సిటీ, రూ.6,400 కోట్లతో జిల్లా–మండల రహదారుల అనుసంధానం వంటి ప్రాజెక్టులను సీఐఐ స్వాగతిస్తోంది. రైతులకు వ్యవసాయ యంత్రాలను అద్దెకిచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాల వద్ద 10,750 కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయం. - నీరజ్ శరద, -చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.10,000 కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నాం. కోవిడ్ సంక్షోభం నుంచి త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి. - సీవీ అచ్యుతరావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ -
తయారీ సంస్థలకు తోడ్పాటు
పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించటం, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేందుకు బడ్జెట్లో కొత్త తయారీ యూనిట్లకు తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధించేలా ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చి 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ యూనిట్లకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతమే (సర్‌చార్జి, సెస్సులు అదనం) ఉంటుంది. దీన్ని పొందాలంటే ఆయా సంస్థలు.. లాభాలు, పెట్టుబడుల ఆధారిత డిడక్షన్లు మొదలైనవి క్లెయిమ్ చేసుకోకూడదు. మరోవైపు, రూ. 5 కోట్ల టర్నోవరు ఉండే చిన్న యూనిట్లకు దీన్ని 30 శాతం నుంచి 29 శాతానికి (సర్‌చార్జి, సెస్సు అదనం) తగ్గించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో దశలవారీగా 25 శాతానికి తగ్గించే దిశగా చర్యలు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొత్త సెజ్ యూనిట్లు.. సెక్షన్ 10ఏఏ ప్రయోజనాలు పొందాలంటే 2020 మార్చి 31 నాటికల్లా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది.