
సాక్షి, తాడేపల్లి: ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చదవండి: లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ
సీఎం జగన్ మాట్లాడుతూ, పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 2024 మార్చి కల్లా రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కావాలన్నారు. 2023 డిసెంబర్ కల్లా పనులన్నీ పూర్తికావాలన్నారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. 2023 జూన్ కల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment