భారత వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిట్ భారత వృద్ధి అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో భారత ఆర్థిక వృద్ది 8%గా ఉంటుందని ఫిచ్ గతంలో అంచనా వేసింది. కానీ ఫిచ్ ఆ అంచనాలను ప్రస్తుతం 7.8%కి కుదించింది. 2016-17లో చైనాతో పోలిస్తే భారత వృద్ధి రేటు (8.1%) ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో భారత వృద్ధి 8% ఉంటుందని పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగి తద్వారా వృద్ధి రేటు పుంజుకోవచ్చని తెలిపింది.