న్యూఢిల్లీ: పటిష్ట వృద్ధి తీర, ద్రవ్య విశ్వసనీయత నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు ‘స్టేబుల్ అవుట్‌లుక్‌తో బీబీబీమైనస్’ ను కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ స్పష్టం చేసింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనావేసిన ఫిచ్, 2025–26లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.
2023–24లో దేశం సాధించిన 8.2 శాతంతో పోల్చితే ఒక శాతంపైగా వృద్ధిరేటు తగ్గుతుండడం గమనార్హం. ఈ ఏడాది మేలో మరో రేటింగ్ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ గ్లోబల్ దేశ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు’ పెంచింది. అయితే ‘బీబీబీమైనస్’ను కొనసాగించింది. రెండు సంస్థల రేటింగ్‌లూ ‘జంక్ స్టేటస్’కు ఒక అంచె ఎక్కువ. మూడీస్ కూడా ఇదే స్థాయి రేటింగ్‌ను దేశానికి ఇస్తోంది.
మూడీస్ వృద్ధి అంచనాల పెంపు
మూడీస్ తాజాగా ఒక నివేదికను విడుదల చేస్తూ, దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను పెంచింది. 2024లో జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 7.2 శాతానికి, 2025లో 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment