International rating agency
-
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్‌లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్‌తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
సావరిన్ రేటింగ్ పెంచండి..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ప్రతినిధులతో సెపె్టంబర్ 28న భారత్ ఆర్థికశాఖ అధికారులు సమావేశంకానున్నారు. దేశ సావరిన్ రేటింగ్ పెంపు చేయాలని ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు భారత్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చే వీలుంది. దేశం 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. వచ్చే వారం సమావేశం కూడా ఈ తరహాలో జరుగుతున్నదేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను పెట్టుబడిదారులు తీసుకుంటారు. -
మూడీస్ ‘రేటింగ్’ షాక్
న్యూఢిల్లీ: భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టేబుల్)గా ఉంది. ఆరి్థక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్’గానే కొనసాగించింది.పెట్టుబడుల విషయంలో రెండో అతి తక్కువ గ్రేడ్ ఇది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ప్రభుత్వ లక్ష్యం జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతం కంటే ఇది ఎక్కువే. వృద్ధి తక్కువగా ఉండడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో ద్రవ్యలోటు అంచనాలను మూడీస్ పెంచింది. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 2013 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలో 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడిస్ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే, రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించడంతో మరిన్ని సంస్కరణలు, దిద్దుబాటు చర్యల దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిచ్ రేటింగ్స్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టేబుల్)గానే కొనసాగిస్తున్నాయి. మూడీస్ అభిప్రాయాలు... ►అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్కలను తెలియజేస్తుంది. ఆరి్థక రంగ వృద్ధి గతం కంటే తక్కువగానే ఉండనుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరి్థక, వ్యవస్థాగత బలహీనతలను పరిష్కరించే విషయంలో ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడాన్ని ఇది కొంత మేర ప్రతిఫలిస్తుంది. ►ఇప్పటికే రుణ భారం అధిక స్థాయిలో ఉండగా, ఇది ఇంకా క్రమంగా పెరిగేందుకు దారితీస్తుంది. ►ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు. ►గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆరి్థక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి. ►ఎన్బీఎఫ్ఐల్లో రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు. ►ఆర్బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆరి్థక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు. ►నెగెటివ్ అవుట్‌లుక్ సమీప కాలంలో రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ఛాన్స్ లే దని తెలియ జేస్తుంది. ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి: కేంద్రం రేటింగ్ అవుట్‌లుక్‌ను నెగెటివ్‌గా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. దీనివల్ల భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ‘‘ఆరి్థక రంగ మూలాలు పూర్తి బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బాండ్ ఈల్డ్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీసుకున్న వరుస సంస్కరణలు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది’’ అని కేంద్ర ఆరి్థక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2019 భాతర వృద్ధి రేటు 6.1 శాతం, తర్వాతి సంవత్సరంలో 7 శాతంగా ఉండొచ్చన్న ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలను ప్రస్తావించింది. భారత వృద్ధి సామర్థ్యాలు ఏమీ మారలేదన్న ఐఎంఎఫ్, ఇతర సంస్థల అంచనాలను గుర్తు చేసింది. ‘‘అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో చురుకైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు భారత్ పట్ల సానుకూల దృక్పథానికి దారితీస్తాయి. నిధులను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తాయి’’అని పేర్కొంది. -
ఈ రేటింగ్లను పట్టించుకోవాలా?
► ఏజెన్సీలు చైనాపై ఒకలా, మనపై ఒకలా వ్యవహరిస్తున్నాయి ► ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ విమర్శ బెంగళూరు: భారత్ రేటింగ్ పెంచే విషయంలో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేటింగ్‌కు సంబంధించి భారత్ విషయంలో ఒకలా చైనా విషయంలో మరోలా వ్యవహరిస్తున్నాయని, అసంబద్ధ ప్రమాణాలు పాటిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక మూలాలు మెరుగుపడినప్పటికీ భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం లేదని ఆక్షేపించారు. ‘ఇటీవలి కాలంలో భారత ఆర్థిక పరిస్థితులు (ద్రవ్యోల్బణం, వృద్ధి, కరెంటు ఖాతా లోటు మొదలైనవి) మెరుగుపడటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. రేటింగ్ ఏజెన్సీలు మాత్రం బిబిబి మైనస్ రేటింగ్‌నే కొనసాగిస్తున్నాయి. కానీ ఫండమెంటల్స్ మరింత దిగజారినప్పటికీ.. చైనా రేటింగ్‌ను ఎఎ మైనస్ స్థాయికి పెంచాయి. మరో మాటలో చెప్పాలంటే భారత్, చైనా విషయంలో రేటింగ్ ఏజెన్సీలు అసంబద్ధ ప్రమాణాలు పాటిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ రేటింగ్ ఇచ్చే అనలిస్టుల అభిప్రాయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నదే నా ప్రశ్న‘ అని అరవింద్ పేర్కొన్నారు. వీకేఆర్‌వీ స్మారకోపన్యాసం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ దిగజారితే వడ్డీ పెరుగుతుంది!! రేటింగ్ ఏజెన్సీలు .. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన గ్రేడ్స్‌లో భారత్‌కు అతి తక్కువ రేటింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి రేటింగ్స్ గల దేశాల్లో ఇన్వెస్ట్ చేయడంలో అధిక రిస్కులు ఉన్నాయని ఇన్వెస్టర్లు భావించడం వల్ల .. ఆయా దేశాలు ప్రపంచ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించాల్సి వచ్చినప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి రేటింగ్ ఇచ్చే విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరును గతంలో కూడా కేంద్రం ఆక్షేపించింది. వృద్ధి మందగిస్తూ, రుణభారం పెరుగుతున్న చైనాకు ఎఎ మైనస్ రేటింగ్‌ను కొనసాగించిన ఎస్అండ్పీ సంస్థ భారత గ్రేడ్‌ను మాత్రం జంక్ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువలో ఉంచడాన్ని ప్రశ్నించింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం లేదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ సైతం గత వారం వ్యాఖ్యానించారు. సబ్‌ప్రైమ్ సంక్షోభమే ఉదాహరణ.. రేటింగ్ ఏజెన్సీలు పాటిస్తున్న అసంబద్ధ విధానాలకు సబ్ ప్రైమ్ సంక్షోభం నాటి పరిస్థితులే ఉదాహరణని అరవింద్ పేర్కొన్నారు. ఎందుకూ కొరగాని తనఖా రుణ పత్రాలకు రేటింగ్ ఏజెన్సీలు ట్రిపుల్ ఎ రేటింగ్ ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి హెచ్చరించడంలో విఫలమైన రేటింగ్ ఏజెన్సీల సమర్ధతపైనా సందేహాలు రేకెత్తాయని వ్యాఖ్యానించారు. -
వాస్తవాలకు దూరంగా రేటింగ్ ఏజెన్సీలు
సంస్కరణలను పరిగణనలోకి తీసుకోలేదు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ భారత్ విషయంలో పునరాలోచించుకోవాలని సూచన న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల తీరును మరోసారి కేంద్రంలోని మరో ముఖ్య అధికారి తప్పుబట్టారు. దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగు పడినా భారతదేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచకుండా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అనుసరిస్తున్న ధోరణిపై ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంతదాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రేటింగ్ ఏజెన్సీలు దేశ వాస్తవిక పరిస్థితులకు ఎన్నో అడుగుల దూరంలోనే ఉండిపోయాయని ఆయన విమర్శించారు. ఏవో కొన్ని అంశాలను అవి విస్మరిస్తున్నాయని, దీనికి రేటింగ్ ఏజెన్సీలే తగిన వివరణ ఇవ్వగలవని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు దాస్ ఇంటర్వూ్య ఇచ్చారు. ‘‘గతేడాది అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కలసి మేము వెళ్లాం. ఆ సమయంలో కొంత మంది ఇన్వెస్టర్లతో చర్చించగా రేటింగ్ ఏజెన్సీలు భారత రేటింగ్‌ను పెంచకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు’’ అని దాస్ వివరించారు. చాలా ఏళ్లుగా మార్పు లేదు... భారత రేటింగ్‌ను రేటింగ్ ఏజెన్సీలు చివరిసారిగా దశాబ్దం క్రితం అప్‌గ్రేడ్ చేశాయి. ఫిచ్ భారత సౌర్వభౌమ రేటింగ్‌ను 2006లో బీబీబీకి పెంచగా, ఎస్అండ్పీ 2007లో ఈ పని చేసింది. ‘‘భారత రేటింగ్‌ను చివరిగా కొన్నేళ్ల క్రితం రేటింగ్ ఏజెన్సీలు పెంచాయి. గత రెండున్నరేళ్లలో దేశంలో జరిగిన సంస్కరణల ట్రాక్ రికార్డును చూడండి. భారత్ చేపట్టిన సంస్కరణల చర్యలను ఓ జాబితాగా తీసుకుని వాటిని గత రెండున్నరేళ్లలో ఏ ఇతర దేశం సంస్కరణల ట్రాక్ రికార్డుతోనయినా పోల్చి చూడండి. మా జీడీపీని చూడండి. ఇతర దేశాల జీడీపీతో దాన్ని పోల్చండి. స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటును కూడా ఇతర దేశాలతో పోల్చి చూడండి. నిజానికి రేటింగ్ ఏజెన్సీలు కొన్ని అంశాలను విస్మరిస్తున్నాయని అనుకుంటున్నాను. అవేంటన్నది రేటింగ్ ఏజెన్సీలే చెప్పగలవు’’ అని శక్తికాంత దాస్ అన్నారు. జీఎస్టీ, దివాలా చట్టాలకు ఆమోదం లభించినా రేటింగ్ ఏజెన్సీలు వాటికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కూడా రేటింగ్ ఏజెన్సీల తీరును కొన్ని రోజుల క్రితం ఎండగట్టిన విషయం తెలిసిందే. -
భారత వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిట్ భారత వృద్ధి అంచనాలను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో భారత ఆర్థిక వృద్ది 8%గా ఉంటుందని ఫిచ్ గతంలో అంచనా వేసింది. కానీ ఫిచ్ ఆ అంచనాలను ప్రస్తుతం 7.8%కి కుదించింది. 2016-17లో చైనాతో పోలిస్తే భారత వృద్ధి రేటు (8.1%) ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో భారత వృద్ధి 8% ఉంటుందని పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగి తద్వారా వృద్ధి రేటు పుంజుకోవచ్చని తెలిపింది. -
బ్యాంకుల పరిస్థితి ప్రతికూలమే!
నెగిటివ్ అవుట్‌లుక్ కొనసాగిస్తున్నట్లు మూడీస్ ప్రకటన * కార్పొరేట్ రుణ బకాయిలే కారణం ముంబై: భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ప్రతికూల అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ బుధవారం పేర్కొంది. కార్పొరేట్ అధిక రుణ బకాయిలే దీనికి కారణమనీ తెలిపింది. మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ఇదొక ఇబ్బందికర అంశంగా ఉన్నట్లు విశ్లేషించింది. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు 2011 నవంబర్ నుంచీ మూడీస్ ‘నెగిటివ్ అవుట్‌లుక్’ను కొనసాగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి బాగున్నప్పటికీ బ్యాంకింగ్ రంగానికి కార్పొరేట్ మొండి బకాయిలు సవాలుగానే ఉన్నట్లు సింగపూర్ నుంచి జారీ చేసిన ఒక విశ్లేషణా పత్రంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయపడింది. బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) 4.5 శాతానికి చేరుతున్నాయని నివేదిక పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ప్రొవిజినింగ్స్ను కొనసాగిస్తూ, మూలధన పెట్టుబడులను మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ రుణాల్లో 70%కిపైగా వాటా కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ‘ప్రతికూల అంచనా’ ఉన్నట్లు మూడీస్ పేర్కొంది. మొండిబకాయిలు పెరుగుతుండడం, అదే బాటలో రుణ పునర్వ్యవస్థీకరణలు, అలాగే లాభాలు తగ్గిపోతుండడం ఇత్యాధి సవాళ్లను ప్రైవేటు బ్యాంకులతో పోల్చితే ప్రభుత్వ బ్యాంకులే అధికంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఆయా బ్యాంకుల్లో ఈ సమస్యలను అధిగమించడం అంత తేలికైన వ్యవహారంగా కని పించడం లేదనీ విశ్లేషించింది. అయితే మరోవైపు ప్రభుత్వ బ్యాంకుల్లో మార్జిన్లు, నిల్వలు, మూలధన పెట్టుబడుల స్థాయిలు బాగుంటున్నట్లు పేర్కొంది.