
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కు తాజాగా ఫిచ్ స్థిరత్వ(స్టేబుల్) రేటింగ్‌ను ప్రకటించింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేబుల్ ఔట్‌లుక్‌తో బీబీబీ రేటింగ్‌ను పొందాయి. ప్రభుత్వ మద్దతు, సానుకూల నిర్వహణా పరిస్థితులు, రిస్క్ ప్రొఫైల్, ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడుతుండటం, నిధుల సమీకరణ, లిక్విడిటీ వంటి అంశాలు రేటింగ్‌కు ప్రభావం చూపినట్లు ఫిచ్ పేర్కొంది.
ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!
బ్యాంక్ సామర్థ్య సంబంధిత వయబిలిటీ రేటింగ్(వీఆర్)ను బీ-ప్లస్ నుంచి బీబీ-మైనస్‌కు అప్‌గ్రేడ్ చేసింది. ప్రభుత్వ మద్దతు రేటింగ్(జీఎస్‌ఆర్)ను బీబీబీ-మైనస్‌గా ప్రకటించింది. బ్యాంకుల రిస్క్ ప్రొఫైల్ మెరుగుపడటం.. ప్రధానంగా ఆర్థిక పనితీరులో ఇది ప్రతిబింబించడం వీఆర్ అప్‌గ్రేడ్‌కు కారణమైనట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలియజేసింది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్, పీఎన్‌బీల దీర్ఘకాలిక జారీ డిఫాల్ట్ రేటింగ్(ఐడీఆర్)కు స్థిరత్వ ఔట్‌లుక్‌తో బీబీబీ-మైనస్ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్‌లో 75 శాతం, పీఎన్‌బీలో 70 శాతం ప్రభుత్వ వాటాతోపాటు.. వ్యవస్థాగత ప్రాధాన్యత ఆధారంగా రేటింగ్‌ను ప్రకటించినట్లు ఫిచ్ వివరించింది. రిస్క్‌లను సమర్ధవంతంగా నిర్వహించగలిగితే.. బ్యాంకుల లాభదాయక బిజినెస్‌కు దేశ ఆర్థిక వృద్ధి మద్దతిస్తుందని అభిప్రాయపడింది. యూనియన్ బ్యాంక్, పీఎన్‌బీ రుణ నాణ్యత రేటింగ్‌లను స్టేబుల్ నుంచి సానుకూలానికి(పాజిటివ్) సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment